Home Cinema రెంట్ ఇచ్చి నాతో ఉండండి ఇప్పటికే 4 సార్లు చేసా.. హీరోయిన్ అంజలి..

రెంట్ ఇచ్చి నాతో ఉండండి ఇప్పటికే 4 సార్లు చేసా.. హీరోయిన్ అంజలి..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దెగ్గర అయింది హీరోయిన్ అంజలి. తెలుగు, తమిళం, కన్నడ ఇలా పలు ఇండస్ట్రీ లలో మంచి హిట్ సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకుంది అంజలి. తన అభినయం, నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. అంజలి మన తెలుగు అమ్మాయి, ఆంధ్ర ప్రదేశ్ లోని రాజోలులో జన్మించింది.

స్కూల్ వరకు అక్కడే చదువుకొని, డిగ్రీ కోసం చెన్నై వెళ్ళింది. ప్రస్తుతం హీరోయిన్ అంజలికి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం తను నటించిన సినిమా గీతాంజలి-2 ఈ ఏప్రిల్ 11న రిలీజ్ అయేందుకు సిద్ధంగా ఉంది. అంజలి తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేయగా అందులో అంజలి పాల్గొనింది. ఆ ఈవెంట్ లో తన పెళ్లి పై వస్తున్న రూమర్ల గురించి అడగగా వాటిపై మొదటి సారి స్పందించింది అంజలి.

anjali-actress

ఇప్పటికే తనకు 4 పెళ్లిళ్లు అయ్యాయి, ఇంకో పెళ్లి కూడా చేస్తున్నారు మరి నా పెళ్ళికి నన్ను పిలవాలి కదా ? పిలవలేదు ఏంటి ? పిలిస్తే వచ్చే దాన్ని కదా అంటూ ఏకసకంగా మాట్లాడుతూ దయచేసి ఇలాంటి పనికిరాని రుమర్లు నమ్మకండి అని చెప్పింది నటి. ఇక తాను ఎవరితోనే సహజీవనం చేస్తుందని, తన ఇంట్లో ఉండటం లేదు అని వచ్చిన రూమర్లపై కూడా స్పందిస్తూ – నాతో ఉంటున్నవారు కనీసం నాకు రెంట్ ఇవ్వండి, ఆ డబ్బుతో ఈఎంఐ కట్టుకుంట అంటూ ఇలాంటి రూమర్ చేసినవారికి చాలా స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చింది అంజలి.

Exit mobile version