Home Cinema Anushka : ప్రభాస్ తో ఆ సినిమా అనవసరంగా చేసా చిచీ.. ఇప్పటికి బాధపడుతున్న అనుష్క..

Anushka : ప్రభాస్ తో ఆ సినిమా అనవసరంగా చేసా చిచీ.. ఇప్పటికి బాధపడుతున్న అనుష్క..

Anushka Shetty : టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోయిన్ లలో మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న హీరోయిన్ అనుష్క శెట్టి. నాగార్జునతో సూపర్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి రంగప్రవేశం చేసింది అనుష్క. మొదటి సినిమానే సూపర్ డూపర్ హిట్ అవ్వటంతో అనుష్కకు సినిమా ఆఫర్లు ఒకేసారి వచ్చిపడ్డాయి. ఆ తరువాత మరెందరో టాప్ హీరోలతో నటించి మంచి సక్సెస్ అందుకుంది. అనుష్క అంటే సౌంత్ లో గుర్తుపట్టని వారు ఉండరు అని చెప్పొచ్చు.

ప్రభాస్ తో అనుష్క నటించిన బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలు సూపర్ హిట్ అవ్వటంతో అమ్ముడికి దేశ వ్యాప్తంగా పేరు, ప్రశంసలు వచ్చాయి. అనుష్క ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే చాల వార్తలు వచ్చాయి, వారు కేవలం స్నేహితులం మాత్రమే ఎక్కువ ఆశలు పెట్టుకోకండి అని క్లారిటీ ఇచ్చేసారు ఇద్దరు. అనుష్క మధ్యలో కొంత కాలం ఇండస్ట్రీ నుండి దూరమై ఏ సినిమాలు చేయలేదు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో గత ఏడాది మంచి హిట్ అందుకొని కంబ్యాక్ ఇచ్చింది.

prabhas-anuhska-billa

తాజాగా అనుష్క ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో నెట్టింట దుమారం లేపుతుంది. అందులో అనుష్క మాట్లాడుతూ ప్రభాస్ తో బిల్లా సినిమా అనవసరంగా చేశా, అందులో నేను బికినీ వేసుకొని నటించాల్సిన ఒక సీన్ ఉంది, అది నాకు ముందు తెలియదు. బాండ్ మీద సంతకం చేసాక కొన్ని రోజులకి తెలిసింది. ముందే తెలిసి ఉంటె చేసేదాన్ని కాదు, కానీ ఇక చేసేది ఎం లేక వేసుకోవాల్సి వచ్చింది. అలా చేసినందుకు ఇప్పటికి బాధపడుతున్న అని చెప్పుకొచ్చింది స్వీటీ.

Exit mobile version