Home Cinema టిల్లు స్క్వేర్ బోల్డ్ సీన్ పై అనుపమ స్పందన.. నాకు కోరికలు ఉంటాయి కదా..

టిల్లు స్క్వేర్ బోల్డ్ సీన్ పై అనుపమ స్పందన.. నాకు కోరికలు ఉంటాయి కదా..

Anupama Parameswaran : డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అనేది మనకు తెలుసు, ఈ సినిమాతోనే సిద్ధూ జొన్నలగడ్డ అంటే ఎవరో తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసి వచ్చింది. అప్పటికి వరకు సిద్ధూ అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు, కానీ డీజే టిల్లు సినిమా రిలీజ్ తరువాత ఎక్కడ లేని పాపులారిటీ హీరో సిద్ధూ సంపాదించుకున్నాడు. తనదైన మానరిజం తో అమ్మాయిల గుండెలు కొల్లకొట్టాడు సిద్ధూ అని చెప్పుకోవచ్చు.

anupama-parameswaran-tillu-square

ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్‘ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్ముడికి కుర్రాళ్ళో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అనుపమకు టాలీవుడ్ లో చాల పెద్ద ఫ్యాన్ బేస్ ఏ ఉంది. తన అందంతో, నటనా సామర్ధ్యంతో కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్ గా నిలిచింది అనుపమ. టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ కొద్దిగా బోల్డ్ గానే నటించింది. ఇలా అనుపమ ముందెప్పుడూ చేయలేదు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ నెల 28న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

ఇక రిలీజ్ డేట్ దెగ్గర పడటంతో సినిమా బృందం నిన్న ఒక కొత్త పాటను రిలీజ్ చేసారు. ఈ రిలీజ్ ఈవెంట్ కి హీరో సిద్ధూ, హీరోయిన్ అనుపమ కూడా వచ్చారు. అనుపమ ఈ సినిమాలో బోల్డ్ గా చేయటంతో తనపై ప్రశ్నల వర్షం కురిసింది, వాటికి అనుపమ కూడా ఘాటుగానే సమాధానం చెప్పింది. “మీకు బిరియాని ఇష్టం అని చెప్పు రోజు బిరియాని తనలేరు కదా ? అపుడుడప్పుడు పులావు పులిహోర కూడా తింటారు కదా. మరి నేను అంతే ఎపుడు ఒకేలాంటి సినిమాలు ఎందుకు చేయాలి.? నాకు కోరికలు ఉంటాయి కదా డిఫరెంట్ స్టోరీ సినిమాలు చేసి ఇంకా పాపులారిటీ సంపాదించుకోవాలి అని.” ఘాటు స్పందించింది అనుపమ.

Exit mobile version