Home Cinema Nagma : 48 ఏళ్ళ వయస్సులో పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ నగ్మా..

Nagma : 48 ఏళ్ళ వయస్సులో పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ నగ్మా..

Nagma : సౌత్ ఇండియా లో హాట్ హీరోయిన్ గా, కోట్లాది మంది యువకులను కొల్లగొట్టిన హీరోయిన్స్ లిస్ట్ తీస్తే నగ్మా పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘భాగీ’ అనే హిందీ సినిమా తో హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసిన నగ్మా, ఆ తర్వాత తెలుగు లో ‘పెద్దింటి అల్లుడు’ సినిమా ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది. ఇక ఆ తర్వాత 1992 వ సంవత్సరం లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘ఘరానా మొగుడు’ అనే చిత్రం సూపర్ హిట్ అందుకున్న తర్వాత ఇక నగ్మా కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కేవలం ఆ ఒక్క ఏడాది లోనే ఆమె 6 సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది.

nagma-about-marriage

అందులో నాలుగు సినిమాలు హిందీ అవ్వడం విశేషం. ఇక ఆ తర్వాత అందరూ చూస్తుండగానే స్టార్ హీరోయిన్ గా ఎవ్వరూ అందుకోని రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇదంతా పక్కన పెడితే ఈమెకి ఉన్నన్ని అఫైర్స్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లో ఏ హీరోయిన్ కి లేదని అందరూ అంటూ ఉంటారు. ముఖ్యంగా అప్పట్లో ఈమె ప్రముఖ ఇండియన్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తో నడిపిన ప్రేమాయణం ఒక సెన్సేషన్. వీళ్లిద్దరి ప్రేమ పెళ్లి వరకు ఎందుకు వెళ్లలేదో తెలియదు కానీ, ఆయా తర్వాత భోజ్ పూరి స్టార్ హీరో రవి కిషన్ తో కూడా ఒక రేంజ్ లో ప్రేమాయణం నడిపింది.

ఇలా పెళ్ళైన వ్యక్తులతో ప్రేమాయణం నడిపిన నగ్మా, 48 ఏళ్ళ వయస్సు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆమె పెళ్లి చేసుకోకపోవడం విశేషం. ఇకపోతే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది నగ్మా, ఆమె మాట్లాడుతూ ‘నాకు కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉంది, నాకంటూ పిల్లలు కావాలని, తోడు కావాలని ఆశగా ఉంది. ఏమో రాబొయ్యే రోజుల్లోనే మీరంతా శుభ వార్త వింటారేమో చూద్దాం. నాకు పెళ్లి జరిగే ఛాన్స్ కూడా ఉంది’ అంటూ నగ్మా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

48 ఏళ్లలో ఈ కోరిక పుట్టిందంటే కచ్చితంగా ఆమె మరో వ్యక్తితో ప్రేమాయణం నడుపుతుంది అనే విషయం అర్థం అవుతుంది అంటూ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్. నగ్మా ప్రస్తుతం భోజపురి సినిమాలో నటిస్తుంది దీనికి కారణం తనకు వేరే ఇండస్ట్రీ నుండి ఆఫర్లు రాకపోవటం. నగ్మా(Nagma) 2004 లో బీజేపీ పార్టీ లో చేరి రాజకీయంగా కూడా తన అదృష్టం పరీక్షించుకున్నారు.

తాను హైదరాబాద్ నుండి ఎంపీ గా 2004 లో పోటీ కూడా చేశారు. నగ్మాది చివరిగా కనిపించిన సినిమా ఒక భోజపురి సినిమా తెల నెంబర్ 501. ఇది 2008 లో రిలీజ్ అయింది. నగ్మా చెల్లెలు తమిళ సినిమాలో ఇప్పటికి కూడా బానే రాణిస్తుంది.

Exit mobile version