Home Cinema Naga Chaitanya : రోజు కోటి రూపాయిలు ఇస్తామంటే ఛీ కొట్టి పంపించిన నాగ చైతన్య..

Naga Chaitanya : రోజు కోటి రూపాయిలు ఇస్తామంటే ఛీ కొట్టి పంపించిన నాగ చైతన్య..

Naga Chaitanya : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోస్ లో ఒకడు అక్కినేని నాగ చైతన్య. ‘జోష్’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన నాగ చైతన్య ఆ తర్వాత ఎక్కువగా లవ్ స్టోరీస్ మీదనే ఫోకస్ పెట్టాడు. అలా ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ కల్ట్ క్లాసికల్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఈ సినిమాలు నాగ చైతన్య కి యూత్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది. అయితే ఈమధ్య నాగచైతన్య టైం అసలు బాగాలేదు(Nagachaitanya 1 crore). చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తున్నాయి.మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ బంగార్రాజు వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత ఆయన చేసిన ‘థాంక్యూ’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

naga-chaitanya

ఈ సినిమా తర్వాత ఆయన కాస్త గ్యాప్ తీసుకొని వెంకట్ ప్రభు తో చేసిన ‘కస్టడీ’ చిత్రం కూడా ఘోరమైన ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమాల తర్వాత ఇక కొడితే కుంభస్థలం బద్దలు అవ్వాలి అనే కసితో, ప్రముఖ డైరెక్టర్ చందు మొలేటి తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య జాలరి పాత్రలో కనిపించబోతున్నాడు. గుజరాత్ లోని ఒక ప్రాంతం లోని జాలరి కుటుంబం లో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇందుకు సంబంధించి నాగ చైతన్య చాలా హోమ్ వర్క్ చేస్తున్నాడు. రీసెంట్ గానే ఎచ్చెర్ల మండలం లోని కె మత్యలేశం గ్రామానికి వెళ్లి, అక్కడి మత్యకారుల జీవన విధివిధానాల గురించి అధ్యయనం చేసాడు. దానికి తగ్గట్టుగానే ఆయన తన గెటప్ ని కూడా మార్చుకున్నాడు. ఇకపోతే రీసెంట్ గానే నాగ చైతన్య కి ఒక స్టార్ హీరో సినిమాలో పది నిమిషాల నిడివి ఉన్న పవర్ ఫుల్ పాత్రని పోషించే అవకాశం దక్కింది. పది రోజుల కాల్ షీట్స్ ఇస్తే పది కోట్ల రూపాయిలు ఇస్తామని చెప్పారట(Nagachaitanya 1 crore). కానీ నాగ చైతన్య మాత్రం ససేమీరా అని అన్నాడట.

ఎందుకంటే ఇప్పుడు చెయ్యబోయే సినిమాకి మేక్ ఓవర్ అనేది చాలా కొత్తగా ఉంటుంది, అందుకే ఈ పాత్రని చెయ్యడానికి రోజు కోటి రూపాయిలు ఇస్తామని ఆఫర్ ఇచ్చినా నాగ చైతన్య రిజెక్ట్ చేసాడట. ఇటీవలే నాగ చైతన్య గురించి ఒక విషయం బాగా వైరల్ అయ్యింది. అదేంటంటే, నాగ చైతన్య సినిమా చూసేందుకు థియేటర్ కి వెళ్లగా అప్పుడు సినిమా మొదలయ్యే ముందు ఖుషి సినిమా ట్రైలర్ ప్లే చేశారు అంట.

అది చూసి నాగ చైతన్య వెంటనే లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అంట. ఇది నిజం కాదు అని నాగ్ చైతన్య నిన్ననే స్పందించటం జరిగింది. ఇంక నాగ ఛైతన్య ఐతే ప్రస్తుతం ఏ సినిమాలు లేకుండా కాలిగా ఉన్నాడు.

Exit mobile version