Home Cinema Actress Poorna: పెళ్ళైనా కూడా ఆ స్టార్ హీరో తో రహస్య ప్రేమాయణం నడుపుతున్న హీరోయిన్...

Actress Poorna: పెళ్ళైనా కూడా ఆ స్టార్ హీరో తో రహస్య ప్రేమాయణం నడుపుతున్న హీరోయిన్ పూర్ణ..

Actress Poorna: యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు ముగ్గురు క్రేజీ హీరోయిన్స్ లో ఒకరు పూర్ణ. ఈమె అసలు పేరు షమ్నా కాసిమ్, ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత తన పేరు ని పూర్ణ గా మార్చుకుంది. అలా మలయాళం లో కెరీర్ ని ప్రారంభించిన ఈమె, అక్కడ దాదాపుగా 8 సినిమాల్లో హీరోయిన్ గా నటించిన తర్వాత, తెలుగు లో రియల్ స్టార్ శ్రీహరి హీరో గా నటించిన ‘శ్రీ మహాలక్ష్మి’ అనే చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచమైంది. ఈ చిత్రం తర్వాత మలయాళం, తమిళం మరియు కన్నడం భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన పూర్ణ.

actress-poorna

తెలుగు లో అల్లరి నరేష్ హీరో గా నటించిన ‘సీమ టపాకాయ్’ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం వల్ల పూర్ణ పేరు ఇండస్ట్రీ లో చాలా గట్టిగా వినిపించింది. అలా కెరీర్ లో దూసుకుపోతూ సుమారుగా 50 సినిమాల్లో హీరోయిన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది. ఇకపోతే రీసెంట్ గానే ఈమె శానిద్ అసిఫ్ అలీ అనే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరికీ ఒక పాప కూడా జన్మించింది,అయితే రీసెంట్ గా పూర్ణ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది.

అదేమిటంటే ఈమె భర్త తో కాపురం చేస్తూనే, రహస్యం గా ఇండస్ట్రీ కి సంబంధించిన ఒక వ్యక్తితో ప్రేమాయణం నడుపుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది(Actress Poorna). రీసెంట్ గానే ఈమె భర్త వ్యాపార లావాదేవీల కోసం దుబాయి కి వెళ్లిన సమయం లో అతను పూర్ణ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడని, ఒక్కోసారి రాత్రుళ్ళు కూడా పూర్ణ ఇంట్లోనే ఉండేవాడని చుట్టూ పక్కన ఉన్న వాళ్ళు గుర్తించి మాట్లాడుకుంటున్నారట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. అయితే ఒక అమ్మాయి, అబ్బాయి స్నేహం గా ఉన్నా కూడా తప్పుడు అర్థాలు తీసుకునే మనుషులు ఉన్న ఈరోజుల్లో వీళ్ళిద్దరినీ కూడా జనాలు అలాగే అర్థ చేసుకొని ఉండొచ్చని పూర్ణ ని అభిమానించే వారు కామెంట్స్ చేస్తున్నారు.

మరి సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ పై పూర్ణ స్పందిస్తుందో లేదో చూడాలి. పూర్ణ షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇతడు దుబాయ్ కి చెందిన వ్యక్తి. వీళ్ళు అందరికి తెలిసినట్టే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కానీ పెళ్లి మాత్రం ఎందుకో తెలీదు కానీ చాలా సీక్రెట్ గా చేసుకున్నారు. పూర్ణ కి మొన్న ఏప్రిల్ లో కొడుకు కూడా పుట్టాడు.

పూర్ణ ప్రస్తుతం ఏ సినిమాల్లో నటించటం లేదు కానీ టీవీ షోల ద్వారా బాగానే సంపాదించుకుంటుంది. ఇపుడు తిను బుల్లి తెరలో మంచి స్టార్ నే చెప్పుకోవాలి. బుల్లి తెర ప్రేక్షకులకి పూర్ణ అంటే బాగా తెలిసిన పేరు.

Exit mobile version