Home Cinema Trisha : మరో పెద్ద సినిమాలో ఛాన్స్ కొట్టేసిన త్రిష..

Trisha : మరో పెద్ద సినిమాలో ఛాన్స్ కొట్టేసిన త్రిష..

Trisha : సాదారణంగా హీరోయిన్ లకు వయసు గడిచే కొద్దీ సినిమా అవకాశాలు దూరం అవుతూ ఉంటాయి, ఈ విషయం ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి హీరోయిన్ కి తెలిసిందే. కానీ నటి త్రిష మాత్రం రోజు రోజుకి సినిమా అవకాశాలు గెట్టిగా కొట్టేస్తుంది. కుర్ర హీరోయిన్ లకు గెట్టి పోటీనే ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. త్రిష ఇండస్ట్రీ కి వచ్చి ఇప్పటికే 20 ఏళ్ళు అవుతుంది, అయినప్పటికీ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పుకోవచ్చు.

మధ్యలో సినిమా అవకాశాలు రాక కొద్దిగా ఇబ్బంది పడింది కానీ ఇప్పుడు తన రెండవ ఇన్నింగ్స్ ఇండస్ట్రీ లో అద్భుతంగా రాణిస్తుంది. మొన్న ఏమో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘విశ్వంభర’ లో మంచి ఛాన్స్ కొట్టేసింది అని అనుకునే లోపే ఇప్పుడు మరో స్టార్ హీరో పక్కన లీడ్ రోల్ సాధించింది అని తెలుస్తుంది. ఇది చూసి కుర్ర హీరోయిన్లు అందరూ తెగ కుళ్ళు కుంటున్నారు అట. ఇంతకి ఏ సినిమా అనే ఆలోచిస్తున్నారా ? రండి తెలుసుకుందాం.

trisha

తమిళ్ స్టార్ హీరో విజయ్ ‘ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటి త్రిష ని అగ్ర హీరోయిన్ గా ఎంపిక చేసారు అట. ఈ సినిమాలో హీరో విజయ్ డబల్ ఆక్షన్ చేయనున్నాడు, కొడుకు తండ్రి లాగా. కుర్ర విజయ్ కి ఏమో జంటగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా, తండ్రి స్థానంలో ఉన్న విజయ్ కి జోడిగా త్రిష. ముందు ఈ పాత్రకి అనుష్క అని అనుకున్నారు అట, కానీ అనుష్క ఒప్పుకోకపోవడంతో త్రిష ని ఎంపిక చేసుకున్నారు.

Exit mobile version