Aditi Rao Hydari : సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్లు చాలా లేట్ గా పెళ్లి చేసుకుంటారు. మరి కొందరు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుని సినిమాలోకి వస్తారు, మరికొందరు ఐతే పెళ్లి చేసుకున్నట్టు కూడా ఎవ్వరికి తెలియనివ్వరు. అలానే ఒక ఫేమస్ హీరోయిన్ కూడా 17 ఏళ్లకే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈ వార్తే సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అని అనుకుంటున్నారా.?
ఆ హీరోయిన్ మరెవరో కాదు అదితి రావు హైదరి. అదితి రాజుల వంశానికి చెందిన అమ్మాయి. 17 ఏళ్లకే తను ప్రేమించిన సత్య డీప్ అనే అబ్బాయిని ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి తరువాత ఇంట్లో చాల పెద్ద గొడవలే జరిగాయి కానీ అదితి మాత్రం సత్య డీప్ ని వదలలేదు. మొదట్లో ఇద్దరు బానే కలిసి ఉన్నారు కానీ మెల్లి మెల్లిగా గొడవలు మొదలైయ్యాయి.
ఇక చేసేది ఎం లేక ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అదితి తిరిగి తన తల్లి తండ్రుల దెగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తరువాత సినిమాల మీద ముక్కువతో హీరోయిన్ అవ్వాలి అని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. అదితి రావ్ హీరో సిద్ధార్థ్ తో కలిసి మహాసముద్రం అనే సినిమా చేసింది. ఆ సినిమా సమయంలో ఇద్దరు ప్రేమలో పడి ఇటీవల పెళ్లి కూడా చేసుకున్నారు. సిద్ధార్థ్ కి ఇది 3వ పెళ్లి.