Home Cinema విడాకులపై స్పందించిన స్టార్ కపుల్.. క్లారిటీ ఇచ్చేసారు..

విడాకులపై స్పందించిన స్టార్ కపుల్.. క్లారిటీ ఇచ్చేసారు..

అవును మీరు చదివింది నిజమే. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ పై విడాకులు రూమర్స్ ఇప్పడి నుండో వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమకు ఓ కూతురు కూడా పుట్టింది ఈ జంట ఎంతో అన్నోన్యంగా ఉంటారు మరియు వీరికి అభిమానులు కూడా ఎక్కువే అని చెప్పాలి. అయితే ఈ క్యూట్ జంటపైన విడాకుల వార్తలు వినిపియ్యడానికి అసలు కారణం ఐశ్వర్య పెట్టె పోస్ట్లు అనే చెప్పాలి.

ఎప్పుడు తన కూతురితో మాత్రమే ఫోటోలు పెడుతూ, తన భర్తతో ఉన్నవి షేర్ చేయకపోవడమే. ఈ వార్తలపై స్టార్ కపుల్ ఎప్పుడు స్పందించలేదు. అయితే ఇటీవల ఐశ్వర్య తన ఇంస్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో నటి, తన భర్త అభిషేక్ మరియు కూతురు తో ఉన్న ఓ ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో వీరి ముగ్గురు ఏంటో చూడ ముచ్చటగా ఉన్నారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్క పోస్ట్ తో స్టార్ కపుల్ విడనుకుల వార్తలకు చెక్ పెట్టారు అనే చెప్పాలి.

aishwarya-clarity-on-divorce-with-her-husband-abishek

ఐశ్వర్య పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి కుటుంబాని చూసుకుంటూ ఉంది. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత ఐశ్వర్య రణబీర్ కపూర్ సినిమాలో నటించి అందరు ఆశ్చర్యపోయే పాత్ర చేసింది. ఈ సినిమాలో రొమాంటిక్ గా కనిపించిన ఈ భామ, పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా బారి విజయం సాధించింది. ఐశ్వర్య ఇంకా ఇలాంటి పాత్రలలో నటించాలని కోరుకుంటున్నారు అభిమానులు.

Exit mobile version