Home Cinema వయస్సులో తమకంటే పెద్దవాళ్ళని పెళ్లి చేసుకున్న స్టార్ సెలెబ్రిటీలు వీళ్ళే..

వయస్సులో తమకంటే పెద్దవాళ్ళని పెళ్లి చేసుకున్న స్టార్ సెలెబ్రిటీలు వీళ్ళే..

Celebrities Married Elder Partners: మన భారతీయ సంస్కృతి ప్రకారం భర్త కంటే భార్య కి తక్కువ వయస్సు ఉండాలి, అలా ఉంటేనే పెళ్లి చేసుకోవాలి అనే నియమం ఉంది. కానీ ప్రేమకి వయస్సుకి అసలు సంబంధమే లేదు అని ప్రేమికులు అంటుంటారు. అలా అనుకున్న జంటలు టాలీవుడ్ , బాలీవుడ్ లో కూడా ఉన్నాయి. భర్త కంటే పెద్ద వయస్సు ఉన్నవారు పెళ్లిళ్లు చేసుకొని ఎంతో సుఖవంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఆదర్శ దంపతులుగా నిలిచారు (Celebrities Married Elder Partners). ఆ సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

celebrities-who-married-elder-partners

సచిన్ టెండూల్కర్ :

క్రికెట్ దిగ్గజం , భారత రత్న అవార్డు గ్రహీత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా వయస్సులో తన భార్య అంజలి కంటే 5 ఏళ్ళు చిన్నవాడు. ఆమెని ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులిద్దరికీ ఒక అర్జున్ టెండూల్కర్,సరా టెండూల్కర్ అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అర్జున్ టెండూల్కర్ రీసెంట్ గానే క్రికెట్ లోకి అడుగుపెట్టగా, సరా టెండూల్కర్ సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.

మహేష్ బాబు :

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ని ప్రేమించి పెళ్లాడాడు. మహేష్ బాబు ప్రస్తుత వయస్సు 48 ఏళ్ళు. నమ్రత శిరోద్కర్ రీసెంట్ గానే 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అలా వయస్సులో తనకంటే రెండుళ్లు పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటికీ వీళ్లిద్దరు రెండు దశాబ్దాల నుండి ఎంతో అన్యోయంగా కాపురం చేసుకుంటున్నారు. వీళ్లిద్దరికీ సితార, గౌతమ్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సైఫ్ అలీ ఖాన్ :

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా తన కంటే చాలా వయస్సులో చాలా పెద్దది అయినా అమృత సింగ్ ని పెళ్లాడాడు. వీళ్లిద్దరికీ ఇద్దరు సంతానం కూడా ఉంది. అయితే కొన్నాళ్ళకు అమృత సింగ్ కి విడాకులు ఇచ్చి ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ని పెళ్లాడాడు సైఫ్ అలీ ఖాన్.

అభిషేక్ బచ్చన్ :

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ప్రముఖ సార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఐశ్వర్య రాయ్ కంటే అభిషేక్ బచ్చన్ వయస్సు లో రెండేళ్లు చిన్న.

ప్రియాంక చోప్రా :

రెండు మూడేళ్ళ గ్యాప్ ఉన్నవారిని పెళ్లి చేసుకోవడం లో పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు, కానీ ప్రియాంక చోప్రా మాత్రం తనకంటే వయస్సు లో 11 ఏళ్ళు చిన్నవాడైన నిక్ జొన్నాస్ ని ప్రేమించి పెళ్లాడింది. 11 ఏళ్ళు గ్యాప్ ఉన్నప్పటికీ వీళ్లిద్దరు ఎంతో ప్రేమగా తమ దాంపత్య జీవితాన్ని ఎలాంటి గొడవలు లేకుండా కొనసాగిస్తున్నారు.

Exit mobile version