Allu Arjun : అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఏంటా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్న వారికీ ఎట్టకేలకు బన్నీ తాను నెక్స్ట్ చిత్రానికి ఎంచుకున్న దర్శకుడిని ఎవరో తెలిసింది. ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ మరో పెద్ద దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడని, ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ పాన్ ఇండియా సినిమా కోసం దర్శకుడు అట్లీతో పాటు కోలీవుడ్ స్టార్‌ని తీసుకున్నారు అని సమాచారం. ఈ చిత్రంలో సమంత మరియు త్రిష కథానాయికలుగా చేస్తున్నారు. అదే విధంగా అనిరుధ్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నాడనే వార్త వైరల్ గా మారింది. ఇదంతా పక్కన పెడితే పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో నటించనున్నాడు. అల్లు అర్జున్ ఆల్రెడీ ఈ చిత్రానికి డేట్లు కూడా ఇచ్చారట.
అయితే ఎప్పటిలా కాకుండా ఈసారి మూడు నెలలకే కాల్ షీట్స్ జారీ చేశారట బన్నీ. ఈ మూడు నెలల్లో తన పాత్ర షూటింగ్ పూర్తి చేసి అట్లీ సినిమాపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. అట్లీ అల్లు అర్జున్ తో పాన్-ఇండియన్ స్థాయిలో సినిమాను తెరకేక్కిన్చాబోతున్నాడు. అందువల్ల, అతను మరింత కాల్షీట్లను స్వీకరించాలి. మొత్తానికి అల్లు అర్జున్ ఏ దర్శకుడిని కూడా సైడ్ పెట్టకుండా సేఫ్ జోన్‌లో ఉంది తన పని తాను చేసుకుపోతున్నాడు.