Ileana : ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరమైనా సోషల్ నెట్‌వర్క్‌లలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ లిస్టులో మొదటి ప్లేసులో ఉంటుంది ఇలియానా. ఈ అమ్మడు పెళ్లి చేసుకున్నప్పటి నుండి సినిమాలకు దూరం ఉంటుంది. కొడుకు, భర్తతో సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో ఇలియానా ఎమోషనల్ గా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలియానా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ క్యూటీ పోకిరి సినిమాతో యువత దృష్టిలో పడింది.
పోకిరి సినిమా విజయం తర్వాత ఇలియానా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోలతో కలిసి నటించింది. అయితే ఇలియానా కెరీర్ టాలీవుడ్ లో ఎక్కువ రోజులు లేదనే చెప్పాలి. దీంతో ఇలియానా బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ఇలియానా అక్కడ వెళాకా సినిమాల కంటే ఎక్కువ ఎఫ్ఫైర్ ల వల్లే ఎక్కువ ఫేమస్ అయింది. వీటివల్ల నటి మానసికంగా కుంగిపోయిన సంగతి తెలిసిందే. ఇలియానా గతంలో ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్‌ను ప్రేమించి, కొని రోజులకు విడిపోవడంతో ఇలియా నా కుంగిపోయింది.
డిప్రెషన్ నుంచి తిరిగి వచ్చిన ఇలియానా మరో వ్యక్తితో ప్రేమలో పడి ఓ బిడ్డకు తల్లి అయ్యింది. ఈ క్యూటీకి ఎప్పటికప్పుడు ఆఫర్లు వస్తూ సినిమాల్లో నటిస్తోంది. ఆమె ఇటీవల చిత్రం దో ఔర్ దో ప్కార్ మంచి పాజిటివ్ బజ్ అందుకుంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలియానా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తానూ మానసిక వ్యాధితో బాధపడుతున్న అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.