Home Cinema Allu Arjun – NTR : ఆ సినిమా ఎన్టీఆర్ ఏ చేయాలనీ పట్టుపట్టిన అల్లు...

Allu Arjun – NTR : ఆ సినిమా ఎన్టీఆర్ ఏ చేయాలనీ పట్టుపట్టిన అల్లు అర్జున్.. బావ రిక్వెస్ట్ కు ఒకే చెప్పిన తారక్..

Allu Arjun – NTR : సినిమా పరిశ్రమలో ఎందరో నటినటులు స్నేహితులు గా ఉండడం మనం చూసాము. ఇలా ఒక హీరో హీరోయిన్ల్ కాదు హీరోలు మరియు డైరెక్టర్లు, నిర్మాతలు మరియు హీరోయిన్లు కూడా స్నేహితుల ఉండడం మనం చూసాము. ఇలా మన టాలీవుడ్ లో ఇద్దరు హీరోలు ప్రాణ స్నేహితులలా ఉన్నవారు ఎవరు అని ఆలోచిస్తే మనకు గుర్తుకువచ్చేది జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్. వీరిద్దరూ తమ కెరీర్ మొదలు పెటినప్పటి నుండి ఇద్దరు మంచి మిత్రులు మరియు

allu-arjun-requested-jr-ntr-to-do-this-film-which-gave-him-blockbuster-success

ఒక్కరినోక్కరు బావ అంటూ పిలుచుకుంటారు. ఇలా ఇద్దరు ఎప్పుడు మీడియా ముందు ఉన్న లెక్కుంది వీరి అభిమానులకు వీరిద్దరి మధ్య ప్రేమ ను తెలుపుతుంటరు. ఇలా ఇద్దరు హీరోలు ప్రాణ స్నేహితులలా బావ అని పిలుచుకోవడం మనం మొదటిసారి చూస్తున్నాము. ఇలా వీళ్లిద్దరు తమ పర్సనల్ విషయాలు కూడా ఒక్కరికొక్కరు చెప్పుకుంటారు మరియు సలహాలు కూడా తీసుకుంటారు అంట. అయితే ఇప్పుడు ఓ వార్తా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

అదేంటంటే, అల్లు అర్జున్ దెగ్గరికి ఓ స్టార్ దర్శకుడు తనకోసం రాసుకున్న ఓ కథను తీసుకొని వస్తే అది విని ఈ కథ నాకంటే తారక్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అన్నారట. అల ఆ దర్శకుడు బన్నీ చెప్పిన మాట విని సరే ఓసారి తారక్ కి కూడా మీ మాటగా చెప్పండి అని రిక్వెస్ట్ చేశారట. బన్నీ తారక్ కు వెంటనే కాల్ చేసి ఈ విషయం చెప్పాడట. అప్పుడు తారక్ ఆ కథ విని ఓకే చెప్పాడు మరియు ఆ సినిమా ఎన్టీఆర్ కు బారి విజయాన్ని అందించింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు మరియు ఆ సినిమా ఏంటో అని అన్నుకుంటున్నారా.

ఆ దర్శకుడు మరెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Jr NTR Allu Arjun) మరియు ఈ బ్లాక్బస్టర్ సినిమా మీ అందరికి తెలిసిన అరవింద సమేత వీరరాఘవ.

అవును ఈ సినిమా త్రివిక్రమ్ అల్లు అర్జున్ కోసం రాసుకుంటే, బన్నీ ఏ తారక్ ను చేయమని సజెస్ట్ చేసి మిత్రుడికి మంచి బ్లాక్బస్టర్ హిట్ అందుకునేలా చెసాడు. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఆనందపడుతున్నారు.

Exit mobile version