Home Cinema Niharika: తాళి బొట్టుని నిహారిక కొణిదెల ఏంచేసిందో తెలుసా..? ఇలా ప్రపంచం లో ఎవ్వరూ చేయరేమో..

Niharika: తాళి బొట్టుని నిహారిక కొణిదెల ఏంచేసిందో తెలుసా..? ఇలా ప్రపంచం లో ఎవ్వరూ చేయరేమో..

Niharika Mangalasutram: రీసెంట్ గా సోషల్ మీడియా లో విడాకులు తీసుకున్న సెలబ్రిటీ గా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఎంతలా పాపులర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. నిశ్చయ్ అనే పేరుతో ఈమె వివాహం ఎంత ఘనంగా రాజస్థాన్ లో జరిపించారో మన అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా వీళ్లిద్దరి ఫోటోలు, వీడియోలే కనిపించేవి. చూడముచ్చటగా ఉంది జంట అని ఎన్ని లక్షల మంది దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరి మధ్య విబేధాలు ఏర్పడి విడిపోవాల్సి వచ్చింది. ఇలా ఈ జంట ఇంత తొందరగా విడిపోతుందని ఎవరూ ఊహించలేకపోయారు.

niharika-mangalasutram

ఇప్పటికే మెగా ఫ్యామిలీ లో చాలా మంది విడాకులు తీసుకొని వార్తల్లో నిలవడం వల్ల నిహారిక మీద కూడా నెగటివిటీ ఒక రేంజ్ లో ఉంది. ఇకపోతే పెళ్లి తర్వాత ఈమె మణికొండ లో ఒక ఫ్లాట్ తీసుకొని ఉంటుంది. స్వతంత్రగా సినిమాలను చేస్తూ, నిర్మిస్తూ తన కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేస్తుంది. ఇది ఇలా ఉండగా విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక కొణిదెల చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఎక్కడ చూసిన దీని గురించే చర్చ. విడాకులు తీసుకున్న తర్వాత ఏ అమ్మాయి అయినా భరణంగా భర్త నుండి ఆస్తులు, డబ్బులు అడగడం సహజం.

కానీ నిహారిక కొణిదెల భర్త నుండి ఒక్క రూపాయి కూడా ఆశించలేదట. విడాకులకు దరఖాస్తు చేసిన తర్వాత కూడా ఆమె తాళిబొట్టు తియ్యలేదట(Niharika Mangalasutram), తనతోనే ఉంచుకుంది అట. కానీ ఎప్పుడైతే విడాకులు వచ్చిందో, ఆ మరుక్షణమే ఆమె తాళిబొట్టుని తీసేసి భర్త కి పంపేసిందట. దానితో పాటు ఆ రెండేళ్ల దాంపత్య జీవితం లో చైతన్య కొనిచ్చిన బహుమతులు, తీసిచ్చిన బట్టలు, తన మీద ఖర్చు పెట్టిన డబ్బు, తనకి ఇచ్చిన ఆస్తి సమస్తం తిప్పి పంపేసింది అట. ఈ కాలం లో ఏ అమ్మాయికి కూడా ఇలా చెయ్యలేదు అనే చెప్పాలి.

అలా చేసిన మొట్టమొదటి సెలబ్రిటీ గా నిహారిక కొణిదెల చరిత్ర సృష్టించింది. ఇకపోతే నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా ఆమె వెబ్ సిరీస్ లో నటించడం ప్రారంభించింది. అంతే కాకుండా పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. వీటితో పాటుగా సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించేందుకు సిద్ధం అయ్యింది. నిహారిక చివరిగా నటించింది డెడ్ పిక్సెల్ అనే ఒక వెబ్ సిరీస్. అది అంతగా హిట్ అవ్వలేదు. ప్రస్తుతం నిహారిక మల్లి సినిమాలకు తిరిగి వచ్చేసింది.

Exit mobile version