Home Cinema Ananya Pandey : నటి అనన్య పాండే వింత కోరిక.. సోషల్ మీడియాలో హల్చల్..

Ananya Pandey : నటి అనన్య పాండే వింత కోరిక.. సోషల్ మీడియాలో హల్చల్..

Ananya Pandey : చంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. లైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనన్య ప్రెజెంట్ ఆశించిన స్థాయిలో పేరు రాకపోవడంతో తెలుగు సినిమాలేవీ చేయడం లేదు. అయితే బాలీవుడ్‌లో ఈమె ట్రెండ్ కొనసాగుతోంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వింత కోరికను మీడియా ముందు చెప్పింది.

తమిళ స్టార్‌ విజయ్‌తో ఓ సినిమా చేయాలనుంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ అందాల తార ఇదే నా కోరిక అని చెప్పింది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ గోట్ సినిమా నటిస్తున్నాడు. ఈయన సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా త‌ర్వాత మ‌రో సినిమా చేస్తారా లేదా అన్న‌ది కూడా క్లారిటీ లేదు. అందుకని అనన్య పాండే కోరిక తీరడం కష్టమని చాలా మంది అంటారు.

ananya-revealed-her-difficult-wish-in-recent-interview

మరికొందరు ఇలా నెగిటివ్ కామెంట్స్ చేస్తూనారు, దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే ఈ డ్రామాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అనన్య పాండే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. అనన్య ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నటించడానికి తన అదృష్టాన్ని పరిక్షితుంది. దక్షిణాదిలో మాత్రం మంచి అవకాశాలు వస్తే ఈ అమ్మడు మంచి సక్సెస్ అందుకుంటాడు. ఇపుడు ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version