Home Cinema Nithya Menen : ఎన్నో రోజుల తరువాత తెలుగులో నటిస్తున్న నిత్యా మీనన్.. హీరో ఎవరంటే..

Nithya Menen : ఎన్నో రోజుల తరువాత తెలుగులో నటిస్తున్న నిత్యా మీనన్.. హీరో ఎవరంటే..

Nithya Menen : నిత్యా మీనన్ ను తెలుగు ప్రజలు ఎంతలా ఆదరించారో మన అందరికి తెలిసిన విషయమే. టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఈ బబ్లీ బ్యూటీకు మంచి అవకాశాలు ఇచ్చారు. ఇలా నిత్యా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నది. అన్నింటికి మించి నిత్యా మీనన్ సినిమాలు ఎంత రియలిస్టిక్ గా ఉంటాయో మనకు తెలిసిందే. నిత్యా నానితో కలిసి అలా మొదలైంది చిత్రంతో తెలుగు చిత్రసీమలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన ఈ మలయాళ బ్యూటీ, అప్పటి నుండి తన చిత్రాలతో యువకుల హృదయాలను కొల్లగొడుతోంది.

నిత్యా మీనన్ ఇటీవల తెలుగులో నటించక చాలా గ్యాప్ వచ్చింది. దీనికి కారణం ఓ ప్రముఖ దర్శకుడు ఆమెను మోసం చేశాడని, అందుకే ఆమె తెలుగు ఇండస్ట్రీకి దూరమైందని పుకార్లు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటె నిత్యా మీనన్ తెలుగులో చాలా కాలం తర్వాత ఓ తెలుగు చిత్రానికి సంతకం చేసినట్లు వార్తలు వచ్చాయి. నిత్యా మీనన్ మరియు నితిన్ సూపర్ క్రేజీ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో విడుదలైన సినిమాలన్నీ విజయవంతమయ్యాయి.

nithya-menen-acting-in-nithin-cinema-after-long-gap-in-telugu-cinema-industry

ఇష్క్ మరియు గుండెజారి గలంతైందే సూపర్‌హిట్ అందుకున్నాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న చిత్రం తముడు. మనకు ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నిత్యా మీనన్ అతిధి పాత్రలో కనిపించనుంది. నితిన్ తో ఉన్న స్నేహం కారణంగానే ఈ హీరోయిన్ మల్లి తెలుగు సినిమాలో నటిస్తుంది. ఇపుడు ఈ ఈ వార్త హాట్ హాట్ గా మారింది.

Exit mobile version