Home Cinema Shyamala : పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసిన యాంకర్ శ్యామల.. ఇంటర్నెట్ లో...

Shyamala : పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసిన యాంకర్ శ్యామల.. ఇంటర్నెట్ లో వైరల్..

Shyamala : యాంకర్ శ్యామల తెలుగు వారికి సుపరిచితురాలు. ఈమె యాంకర్ గా మరియు నటిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నారు. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ సినిమాల్లో కూడా సక్సెస్‌ని అందుకుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుంది. అయితే శ్యామల కేవలం యాంకరింగ్, నటనలోనే కాకుండా పాలిటిక్స్ లో కూడా ఇంటరెస్ట్ చూపిస్తుంది. ఈ భామ తాజాగా వైసీపీలో చేరి సంచలన వ్యాఖ్యలు చేసింది.

సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ పై శ్యామల భీకరమైన వ్యాఖ్యలు చేస్తుంది. ఈమె ఎప్పుడైతే వైసీపీలో చేరి టీడీపీని, జనసేనను దూషించారో అప్పటి నుంచి ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజనులు. ఈ రోజుల్లో రాజకీయాల గురించి ఏదో ఒక విధంగా మాట్లాడటం సర్వసాధారణం. తాజాగా శ్యామలకు సంబంధించిన అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఈ బామ్మ మాట్లాడుతూ, “అసలు నేను పవన్ కళ్యాణ్‌కి అభిమానిని కాదు.

shyamala-sensational-comments-on-pawan-kalyan

కానీ, ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు బోలెడన్ని చేసారు. అవి తెలుసుకున్న కాబట్టి నేను ఆయనకు అభిమానిని అయ్యాను. అందుకే అలాంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. నా అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ ఎవరినీ అనుసరించే రకం కాదు. ఇలాంటి ఆయన పైన శ్యామల డబ్బు కోసం పని చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ భీకరమైన వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్‌లలో హల్‌చల్ చేస్తోంది.

Exit mobile version