Home Cinema Anchor Suma : వింత వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్..

Anchor Suma : వింత వ్యాధితో బాధపడుతున్న యాంకర్ సుమ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్..

Anchor Suma : బుల్లితెర మీద సంచలనం సృష్టించిన యాంకర్స్ లిస్ట్ తీస్తే అందులో సుమ పేరు లేకుండా ఉండదు. బుల్లితెర మెగా స్టార్, బుల్లితెర పవర్ స్టార్ అంటూ ఈమెని అభిమానులు పిలుచుకుంటారు. ఇంటర్వ్యూస్ దగ్గర నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరకు ప్రతీ ఒక్కరికి సుమనే కావాలి. మన చిన్నతనం నుండి ఇది కొనసాగుతూనే ఉంది(Anchor Suma Disease). ఈమెతో పాటు ప్రారంభమైన యాంకర్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఏమి చేసున్నారో ఎవరికీ తెలియదు.

anchor-suma-kanakala-is-suffering-from-rare-skin-disease

ఈ గ్యాప్ లో ఎంతో ప్రతిభావంతులైన యాంకర్స్ కూడా ఇండస్ట్రీ కి వచ్చారు. కానీ సుమ రేంజ్ ని మాత్రం అందుకోలేకపోయారు. ఆమెలోని అద్భుతమైన కామెడీ టైమింగ్ వల్లే ఇంకా డిమాండ్ ఉందని విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఈమె కెరీర్ ని ముందుగా సినిమా హీరోయిన్ గానే ప్రారంభించింది. ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ ఈమె మొదటి చిత్రం. ఈ సినిమా పెద్దగా ఆడలేదు, ఆ తర్వాత మలయాళం లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది, కానీ వర్కౌట్ కాలేదు.

ఆ తర్వాత సీరియల్ ఆర్టిస్టుగా రాణించిన సుమ, తర్వాత యాంకర్ గా మారింది. యాంకర్ గా మారిన తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈమె ఒక్క రోజు కాల్ షీట్ కనీసం 20 లక్షల వరకు ఉంటుంది. అంత డిమాండ్ ఉన్న యాంకర్ అన్నమాట. ఇది ఇలా ఉండగా ఈమె ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమె వ్యక్తిగతం గురించి దాదాపుగా ప్రతీ విషయం అందరికీ తెలుసు.

కానీ ఆమెకు ఉన్న వింత వ్యాధి గురించి మాత్రం చాలా మందికి తెలియదు. అసలు విషయానికి వస్తే సుమ చాలా కాలం నుండి కీలాయిడ్ టెండెన్సి అనే వింత వ్యాధితో పోరాడుతూ ఉందట. ఇది ఒక అరుదైన స్కిన్ డిసీస్(Anchor Suma Disease). ఈ వ్యాధి వల్ల మేకప్ వేసుకోవాల్సి వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందట.

కెరీర్ ప్రారంభం లో ముఖానికి మేకప్ ఎలా వేసుకోవాలి ఎలా తియ్యాలి వంటి విషయాల గురించి పెద్దగా తెలియకపోవడం వల్లే ఈ వ్యాధి సోకడానికి కారణం అయ్యింది. చర్మం మీద చిన్న గాయం అయినా ముఖం మొత్తం పాకేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది సుమ. ఆమె మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అభిమానులు ఇది విన్నాక కంగారు పడుతున్నారు.

Exit mobile version