Home Cinema ప్రభాస్ – అనుష్క కంబినేషన్లో సినిమా ఫిక్స్.. డైరక్టర్ ఎవరంటే..

ప్రభాస్ – అనుష్క కంబినేషన్లో సినిమా ఫిక్స్.. డైరక్టర్ ఎవరంటే..

సినిమా ఇండస్ట్రీలో ఆన్ స్క్రీన్ జంటలు ఎన్నో వస్తున్నా కూడా కొని జంటలనే అభిమానులు ఆదరిస్తుంటారు. ఈ లిస్టులో మొదటి ప్లేస్ లో ఉంటారు ప్రభాస్ మరియు అనుష్క శెట్టి. వీరిద్దరూ బిల్లా సినిమాతో మొదటిసారి ఆన్ స్క్రీన్ మీద కలిసి కనిపించరు. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఈ జంట ఎవరికీ వచ్చిన సినిమాలు వారు చేసుకుంటూ వెళ్లిపోయారు.

ప్రభాస్ మరియు అనుష్క స్టార్ హీరో హీరోయిన్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు. వీరి అభిమానులు బిల్లా సినిమా తరువాత వీరిద్దరిని మల్లి కలిసి చూడాలనుకున్నారు. ఆ కోరికను కొరటాల శివ మిర్చి సినిమాతో నిరవేర్చాడు. ఈ సినిమా అప్పట్లో ప్రభాస్ అనుష్కల కెరీర్లోనే మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత వీరిద్దరి జంటకు అభిమానులు మరింత ఫిదా అయ్యారు. అప్పటి నుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ ఎన్నో వార్తాలు వినిపించాయి.

anushka-shetty-and-prabhas-acting-together-after-very-long-time

ఆ తరువాత ప్రభాస్ – అనుష్క ఇద్దరు కలిసి బాహుబలి సినిమాలో కలిసి నటించారు. ఈ సూపర్ క్యూట్ జంట ఈ సినిమా తరువాత కలిసి నటించ లేదు. ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. అనుష్క శెట్టి చాలా రోజుల గ్యాప్ తరువాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మన ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం అనుష్క శెట్టి ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. ఇదే నిజం అయితే అభిమానుల కల నిరవేర్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version