Home Cinema Prabhas-Anushka: ప్రభాస్ ఎంత చెప్పినా వినకుండా అనుష్క నటించిన ఆ సినిమా ఏది..

Prabhas-Anushka: ప్రభాస్ ఎంత చెప్పినా వినకుండా అనుష్క నటించిన ఆ సినిమా ఏది..

Prabhas Warned Anushka: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్యూట్ జంటల లిస్ట్ తీస్తే అందులో ప్రభాస్ – అనుష్క జంట ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరు కలిసి వెండితెర మీద కాసేపు కనిపించిన చాలు అభిమానులు కళ్ళు ఆర్పకుండా అలా చూస్తూ ఉండిపోతారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వీళ్లిద్దరి మధ్య వేరే లెవెల్ లో ఉంటుంది. అందుకే వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని, ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటున్నారు అంటూ చాలా కాలం నుండి రూమర్స్ వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే అనుష్క , ప్రభాస్ లు అత్యంత సన్నిహితంగా ఉండడం కూడా వీళ్లిద్దరి మధ్య ఉన్న రూమర్స్ కి మరింత ఆజ్యం పోసింది.

prabhas-anushka-shetty

వీళ్లిద్దరు మంచి సన్నిహితులు, ఒకరి కష్ట సుఖాలను మరొకరు పంచుకుంటారు అనే విషయం వాస్తవమే, కానీ అందరూ అనుకుంటున్నట్టుగా ప్రేమికులు మాత్రం కాదు, మంచి స్నేహితులు, ఈ విషయాన్నీ అటు ప్రభాస్, ఇటు అనుష్క ఎన్నో సందర్భాలలో క్లారిటీ ఇచ్చారు కూడా. ఇదంతా పక్కన పెడితే అనుష్క గతం లో తాను సినిమా చెయ్యాలి అనుకున్నా ముందుగా తనకి ఎంతో దగ్గరైన సన్నిహితులకు స్క్రిప్ట్ ని వినిపించి వారి సలహాలను తీసుకొని, ఆ తర్వాత ఆ సినిమాలను చెయ్యాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటుందట(Prabhas Warned Anushka).

అలా ఆమె ప్రభాస్ ని కూడా ఎన్నో సందర్భాలలో ఒక సినిమా చేసేముందు స్క్రిప్ట్ ని వినిపించి అతని అభిప్రాయం తీసుకునేదట. అలా ఆమె వేదం సినిమా స్క్రిప్ట్ ని కూడా ప్రభాస్ కి ముందుగా వినిపించిందట, ఇందులో అనుష్క సరోజా అనే వేశ్య పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. సౌత్ ఇండియాలోనే హీరోయిన్స్ క్యారగిరీ లో సూపర్ స్టార్ స్టేటస్ లో ఉన్నావు, ఈ సమయం లో ఇలాంటి పాత్రలు చేయడం నీ మీద తీవ్రమైన నెగటివ్ ఇంపాక్ట్ పడేలా చేస్తుంది దయచేసి ఈ పాత్ర చేసేందుకు ఒప్పుకోకు అని ప్రభాస్ చెప్పాడట.

ప్రభాస్ చెప్పింది ముందుగా అనుష్క ఆలోచించింది కానీ, ఆ తర్వాత ప్రభాస్ కి సర్దిచెప్తూ , ఈ పాత్రలో మంచి డెప్త్ ఉందనీ, నిన్ననే క్రిష్ పూర్తి స్థాయి న్యారేషన్ ఇచ్చాడు ఒకసారి వినమని చెప్పి , ఆమె పాత్ర తీరుతెన్నెలు గురించి వివరించి ప్రభాస్ ని ఒప్పించి ఈ సినిమా చేసిందట అనుష్క. ఇక సినిమా విడుదలైన తర్వాత ఆ పాత్రకి ఎంత మంచి గుర్తింపు లభించిందో మన అందరికీ తెలిసిందే. అనుష్క ప్రస్తుతం ప్రభాస్ సినిమా ప్రాజెక్ట్ కే లో కూడా నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version