Home Cinema Balakrishna: బాలయ్య మల్టీ స్టారర్ సినిమా.. బాక్స్ లు బద్దలు కావాల్సిందే..

Balakrishna: బాలయ్య మల్టీ స్టారర్ సినిమా.. బాక్స్ లు బద్దలు కావాల్సిందే..

Balakrishna: యువరత్న నందమూరి బాలకృష్ణ ఏం చేసినా సెన్సేషనల్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆయనకు సీఎంల నుంచి అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో కూడా వందలాది మంది యంగ్ హీరోలు ఆయన అభిమానులే. ఇక ఆయన సినిమాల గురించి చెప్పుకుంటే ఒక్కోటి ఒక్కో విలక్షణ కథతో ఉంటుంది. కథను ఎంచుకోవడంలోనూ బాలయ్యబాబు వైవిద్యం చూపుతారన్న టాక్ ఉంది (Raviteja Balakrishna Multistarrer). అయితే ఇటీవల వచ్చిన ఆయన సినిమా ‘వీరసింహారెడ్డి’. ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఇందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించారు.

balakrishna-raviteja-multi-starrer

శృతిహాసన్, హనీరోజ్ హీరోయిన్లుగా నటించారు. బాలయ్య కెరీర్ లో ఈ మూవీ వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్లు సాధించుకున్న మూవీగా నిలిచింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్నాడు బాలయ్య బాబు. దీనికి సంబంధించి వరుస అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ మూవీ అయిపోయిన తర్వాత డైరెక్టర్ బాబితో కలిసి ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇదులో ఆయనకు జంటగా రకుల్, నయనతారలను కూడా మేకర్స్ సంప్రదించినట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరో అప్ డేట్ ఒకటి లీక్ అయ్యింది.

బాబి సినిమాలో మరో తెలుగు టాప్ స్టార్ కూడా నటించబోతున్నారట (Raviteja Balakrishna Multistarrer). అయితే ఆయన విలన్ పాత్రలో కనిపిస్తారని వార్త హల్ చల్ అవుతుంది. టాలీవుడ్ లో మాస్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న నటుడు రవితేజ. రవితేజకు-డైరెక్టర్ బాబికీ మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో బాలయ్య సినిమాలో రవితేజను కూడా తీసుకోవాలని బాబి అనుకుంటున్నారట. ఇటీవల ఆయన తీసిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కూడా చిరంజీవి తమ్ముడిగా రవితేజను తీసుకువచ్చిన బాబీ ఈ సినిమాకు సంబంధించి రవితేజకు కొన్ని సీన్స్ పెడుతున్నారట.

అయితే రవితేజ చిన్న తనం నుంచి బాలకృష్ణకు అతిపెద్ద ఫ్యాన్. ఆయనతో ఒక్కసారైనా స్ర్కీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాడట. ఈ సినిమాతో ఆయన కూడా సంతోషిస్తాడని బాబి ప్లాన్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా చెక్కర్లు కొడుతోంది. ఇద్దరూ మాస్ హీరోలు ఒకే సీన్ లో కనిపించే ఇక అభిమానులకు పండగే. భగవత్ కేసరి 20 అక్టోబర్ న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని ఫాన్స్ చాల ఆశతో ఉన్నారు. చూదాం బాలయ్య ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడా లేదో.

Exit mobile version