Home Cinema Raj Tarun : రాజ్ తరుణ్ – లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. కేసు నమోదు...

Raj Tarun : రాజ్ తరుణ్ – లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. కేసు నమోదు చేసిన పోలీసులు..

Raj Tarun : యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తుంది. 11 ఏళ్లుగా తనతో ఉంటూ మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజ్‌తరుణ్‌పై లావణ్య హైదరాబాద్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్‌తో రిలేషన్‌లో ఉన్న సినీ నటి మాల్వీ మల్హోత్రా, తన సోదరుడు తనను బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. రాజ్‌తరుణ్‌ని వదిలేస్తే కొంత డబ్బు ఇష్టము, లేదంటే చంపేస్తానని తన సోదరుడు బెదిరిస్తున్నాడని లావణ్య మాళవిని ఆరోపించింది.

హిమాచల్ ప్రదేశ్ సీఎం తన తండ్రికి ఆప్తమిత్రుడని మాల్వి బ్లాక్ మెయిల్ చేస్తుంది అని లావణ్య అన్నారు. మాల్వి ఉచ్చులో పడి, రాజ్ తరుణ్ ఆమెకు దూరం అయ్యాడు అని ఆమె తెలిపింది. అయితే, ఫిర్యాదులో అనుమానాస్పదంగా ఉన్నందుకు తగిన సాక్ష్యాధారాలు అందించాలని డిమాండ్ చేస్తూ నార్సింగి పోలీసులు లావణ్యకు నోటీసులు జారీ చేశారు. తనపై లావణ్య చేసిన విమర్శలపై రాజ్ తరుణ్ కూడా స్పందించాడు. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా తన క్లోజ్ ఫ్రెండ్ అని పేర్కొన్నాడు.

twist-in-raj-tarun-lavanya-issue-police-filed-case-against-young-hero

లావణ్య, నేను 2017 వరకు మాత్రమే కలిసి ఉన్నామని, అయితే తర్వాత ఆమె డ్రగ్స్‌కు బానిస అయ్యింది. అందుకే ఆమెతో దూరంగా ఉంటున్నాడని రాజ్ తరుణ్ చెప్పాడు. కానీ లావణ్య రాజ్‌తరుణ్‌పై రోజుకో ఆరోపణ చేస్తుంది. తాను గర్భవతి అయిన తర్వాత రాజ్‌ తరుణ్ తనకు అబార్షన్ కూడా చేయించాడని, అందుకు సంబంధించిన వైద్య పత్రాలను పోలీసులకు అందించిందని లావణ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. దీని ఆధారంగా పోలీసులు ఐపీసీ సెక్షన్ 493తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Exit mobile version