Home Cinema Anushka Shetty : నాకు ఆ సినిమా అస్సలు నచ్చదు.. తానూ నటించిన ఓ సినిమా...

Anushka Shetty : నాకు ఆ సినిమా అస్సలు నచ్చదు.. తానూ నటించిన ఓ సినిమా పై అనుష్క కామెంట్స్..

Anushka Shetty : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికల్లో అనుష్క శెట్టి ఒకరు. సూపర్ మూవీ ద్వారా వెండితెరకు పరిచయమైన అనుష్క, త్వరగానే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అరుంధతి, పంచాక్షరి మరియు భాగమతి వంటి మహిళా ప్రధాన చిత్రాలతో ఆమె గొప్ప నటి అని ప్రూవ్ చేసుకుంది. అప్పట్లో ఈ సినిమా బారి విజయం సాధించాయి. కానీ కొన్ని నెలలుగా అనుష్క సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడు మల్లి ఈమె సినిమాలను సైన్ చేసింది అంటూ వార్తలు సినెమాఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

దీనితో ఈమె అభిమానులు సంతోష పడుతున్నారు. ఇదిలా ఉంటే, అనుష్క అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో బెస్ట్ మరియు వేస్ట్ చిత్రాల గురించి మాట్లాడింది. వేదం, అరుంధతి సినిమాలు తనకు బాగా నచ్చిన సింఎంలు అని అనుష్క చెప్పింది. ఈ చిత్రాల్లో నా పాత్రలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి మరియు నాకు నటి గా మంచి పేరును తెచ్చి పెట్టాయి అని ఆమె అన్నారు. అనుష్క తన కెరీర్‌లో వెస్ట్ సినిమా అంటే అది ఒక్క మొగాడు అని చెప్పింది. దీనితో ఈ వార్తా సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.

anushka-said-this-is-the-worst-cinema-i-did-in-my-career-in-an-interview

ఒక్క మొగాడు సినిమా 2008లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకత్వం వై.వి.ఎస్. చౌదరి వహించగా, నటుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. ఆయనతో పాటు అనుష్క శెట్టి, సిమ్రాన్, విశా కొఠారి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కథాంశం దాదాపు శంకర్ భారతీయుడు చిత్రానికి కాపీ అని పలువురు విమర్శకులు కురిపించారు. సర్దార్ పాపారాయుడు సినిమాలో కొన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని ప్రేక్షకులు వెల్లడించారు.

Exit mobile version