Home Cinema Chiranjeevi-Balakrishna: ఆ స్టార్ హీరోయిన్ కోసం కొట్టుకున్న చిరంజీవి బాలయ్య.. దారుణం..

Chiranjeevi-Balakrishna: ఆ స్టార్ హీరోయిన్ కోసం కొట్టుకున్న చిరంజీవి బాలయ్య.. దారుణం..

Chiranjeevi Balakrishna Fight: ఇండస్ట్రీ లో స్టార్ హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పోటీతత్వ వాతావరణం ఉన్నప్పటికీ వ్యక్తిగతం గా అందరూ స్నేహం గానే ఉంటారని ఇండస్ట్రీ లో అందరూ అనుకుంటూ ఉంటారు. నేటి తరం స్టార్ హీరోలైతే అలాగే ఉన్నారు. కానీ నిన్నటి తరం స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మధ్య ఇప్పటికీ మనస్పర్థలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే టాక్. బహిరంగంగానే బాలయ్య బాబు అనేక సార్లు చిరంజీవి పై కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ చిరంజీవి మాత్రం పెద్దగా వాటికి రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ, బాలయ్య కి మాత్రం చిరంజీవి అంటే పడదు అనే విషయం అందరికీ అర్థం అయిపోయింది.

Chiranjeevi-Balakrishna-fight

ఇకపోతే గతం లో వీళ్లిద్దరు కేవలం ఓకే హీరోయిన్ కోసం గొడవపడ్డారని, అప్పటి వరకు ఇద్దరూ మంచి స్నేహం గానే ఉండేవారని, ఆ హీరోయిన్ వల్లే వీళ్లిద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే టాక్. మరి ఆ హీరోయిన్ మీరెవరో కాదు సౌందర్య అట. చిరంజీవి – సౌందర్య కాంబినేషన్ లో మొట్టమొదటిసారిగా ‘చూడాలని ఉంది’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో ‘అన్నయ్య’ అనే చిత్రం వచ్చింది, ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

అయితే ‘చూడాలని ఉంది’ సినిమా కంటే ముందే ఆమె బాలయ్య బాబు తో ‘మాతో పెట్టుకోకు’ అనే చిత్రం చేస్తానని ఒప్పుకుందట. కానీ ‘చూడాలని ఉంది’ చిత్రం ఆఫర్ రాగానే బాలయ్య సినిమాని పక్కన పెట్టి, చిరంజీవి కి ఓకే చెప్పిందట సౌందర్య. ఇదంతా చిరంజీవే కావాలని చేయించాడని బాలయ్య అనుకున్నాడట. అప్పటి నుండే వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైంది(Chiranjeevi Balakrishna Fight). ఒకరికొకరు ఎదురు పడినప్పుడు ఇద్దరు మంచిగానే మాట్లాడుకుంటారు కానీ, మనసులో ఎక్కడో చిరు కోపం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీళ్లిద్దరు రామ్ చరణ్ ఎన్టీఆర్ లాగ ప్రాణ స్నేహితులు లాగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఫ్యాన్స్.

కానీ అది ఇప్పట్లో సాధ్యపడేలా అనిపించడం లేదు. ఇకపోతే ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ తో చిరంజీవి, ‘వీర సింహా రెడ్డి’ తో బాలయ్య పోటీపడిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం అత్యధిక వసూళ్లను రాబట్టి పొంగల్ విన్నర్ గా నిల్చింది. చిరు నటిస్తున్న భోళా శంకర్ సినిమా షూటింగ్ ఐపోయినట్టే అనే చెప్పుకోవాలి, ఈ సినిమా వచ్చే నెల ఆగష్టు 11 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక బాల కృష్ణ నటిస్తున్న సినిమా భగవత్ కేసరి, ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. చూదాం ఈ సరి ఏ హీరో కు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయో.

Exit mobile version