Home Cinema Samantha : బాలిలో సమంత చేసే విన్యాసాలు చూసి నోటిమీద వేలు వేసుకున్న జనాలు..

Samantha : బాలిలో సమంత చేసే విన్యాసాలు చూసి నోటిమీద వేలు వేసుకున్న జనాలు..

Samantha : నటి సమంత.. ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు టాలీవుడ్ ఇండస్ట్రీలో. సమంత తెలుగు చిత్ర పరిశ్రమలో గత దశాబ్ద కాలం నుండి తన సత్తా చాటుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ(Samantha Fitness) తన నటనతో మరియు అందంతో కుర్రగాల మనసులు దోచేసింది మరియు ఈవిడ విజయంవంతమైన చిత్రాలు చాలానే ఉన్నాయి. ఈ అమ్మడు తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలు చేసింది. సామ్ బాలీవుడ్ లో ఫామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేసింది మరియు

samantha-amazing-fitness-feat-in-her-baali-vacation-made-everyone-surprise

అందులో ఈ బ్యూటీ బోల్డ్ పాత్ర చేసి మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ఇలా సమంత స్టార్ హీరోయిన్ గా దూసుకపోతున్న సమయంలో ఈమెకు మయోసిటిస్ అనే వ్యాధి సోకింది మరియు అప్పటి నుండి సామ్ తన కెరీర్ లో స్లో అయ్యింది అని చెప్పుకోవచ్చు. ఈవిడ అప్పట్లో ఒక ఏడాది పాటు సినిమాలు చేయలేదు మరియు మయోసిటిస్ వ్యాధి చికిస్త కోసం బ్రేక్ తీసుకుని తన ఆరోగ్యంపై దృష్టిపెట్టింది. సమంత తన ఆరోగ్యం కొంత కుదుటపడ్డాక మల్లి సినిమాలు చెయ్యటం మొదలుపెట్టింది.

ఇటీవల ఆమె బ్రేక్ తరువాత చేసిన సినిమాలు శాకుంతలం మరియు ఖుషి మూవీ. అయితే గుణశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం శాకుంతలం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలిచింది. సమంత హోప్స్ అంతా ప్రస్తుతం ఖుషి సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు మరియు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈ లవ్ స్టోరీ అయినా హిట్ కొట్టి సమంత కు కొంత మోటివేషన్ ఇస్తుందని అన్నుకుంటున్నాము.

ఇదిలా ఉంటె ఈ మధ్య ఖుషి షూటింగ్ ముగించుకున్న సమంత తన ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లాలని డిసైడ్ అయ్యింది. ఈ విషయం ఆమె సోషల్ మీడియా కాత ద్వారా తన అభిమానులకు తెలిపింది. అయితే సామ్ అమెరికా వెళ్లే ముందు ఓ వక్షన్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకొని తన స్నేహితురాలితో బాలి వెళ్ళింది. అక్కడ తన స్నేహితురాలితో ఓ ఫిట్నెస్(Samantha Fitness) ఫీట్ చేసింది మరియు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది మా పార్టీ అని ఆమె ఆ వీడియోకు కాప్షన్ ఇచ్చింది.

ఇది చూసిన నెటిజనులు మీ పార్టీ ఇలా ఉందేంటి అని కామెంట్స్ పెడ్తున్నారు. సమంత బాలి వెళ్లేముందు కోయామ్బతురు లోని ఇషా ఫౌండేషన్ కు వెళ్ళింది. ఆ తరువాత బాలి వెళ్లి అక్కడ అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలు పెట్టింది. ఈ ట్రిప్ తరువాత సామ్ నేరుగా అమెరికా కు వెళ్లి తన ట్రీట్మెంట్ మొదలు పెడుతుందట.

Exit mobile version