Home Cinema Venkatesh : ఘనంగా హీరో వెంకటేష్ కూతురి నిశ్చితార్థం.. ఆ ఇద్దరు స్టార్లు హాజరయ్యారు..

Venkatesh : ఘనంగా హీరో వెంకటేష్ కూతురి నిశ్చితార్థం.. ఆ ఇద్దరు స్టార్లు హాజరయ్యారు..

Venkatesh : టాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ ఎవరన్నా ఉన్నారంటే అది మన హీరో వెంకటేష్ అనే చెప్పాలి. వెంకటేష్ నిర్మాత అయినా లేట్ దగ్గుబాటి రామానాయుడు గారి రెండో కుమారుడు. ఈయన రెండు దశాబ్దాలపైనా సినిమాలలో హీరో గా నటిస్తున్నాడు. వెంకటేష్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి విక్టరీ వెంకటేష్ అని పేరు కూడా సంపాదించుకున్నారు. ఈయన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి. వెంకీ( Venkatesh Daughter Engagement ) తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకున్నాడు.

chiranjeevi-mahesh-babu-attended-venkatesh-daughter-hayavahini-daggubati-engagement

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో కాంట్రవర్సీలకు దూరంగా ఉండేది వెంకటేష్ ఒక్కడే. వెంకీ కి సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి ఉంది మరియు ఈయన తన కుటుంబాన్ని సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంచాడు. వెంకటేష్ కు మొత్తం నలుగురు సంతానం. అందులో ముగ్గురు అమ్మాయిలు మరియు ఒక కుమారుడు ఉన్నారు. వెంకటేష్ పెద్ద కూతురు పేరు ఆశ్రిత దగ్గుబాటి. ఈమెకు పెళ్లి చేసేసాడు వెంకీ మామ. ఆశ్రిత ప్రస్తుతం తన భర్తతో ఫారిన్ లో ఉంటుంది.

అయితే ఇటీవల వెంకటేష్ రెండో కూతురు హయవాహిని దగ్గుబాటి నిశ్చితార్థం ఇక్కడే హైద్రాబాద్లో జరిగింది. వెంకటేష్ రెండో కూతురిని చేసుకోబోయే ఆయన, విజయవాడకు చెందిన డాక్టర్ అని సమాచారం. వీరి ఎంగేజ్మెంట్ కు దగ్గుబాటి కుటుంబం, వరుడు కుటుంబం మరియు సినిమా ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు హాజరయి వీరిని దీవించారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వెంకటేష్ క్లోజ్ ఫ్రెండ్ అయినా చిరంజీవి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యారు.

వీరి నిశ్చితార్థం వెంకటేష్ ఇంట్లోనే జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన వెంకటేష్ అభిమానులు ఆనందంతో నవ దంపతులకు ( Venkatesh Daughter Engagement ) శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే వెంకటేష్ గారి సినిమాల విషయానికి వస్తే, వెంకీ ప్రస్తుతం సైలేష్ కోలేను దర్శకత్వంలో సైన్ధవ్ అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ కూడా విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడం తో దగ్గుబాటి అభిమానులు అందరు ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version