Home Cinema Chiranjeevi : చిరు 157 వ సినిమాలో విలన్ గా తెలుగు హీరో.. ఎవరో తెలుసుకోవాలని...

Chiranjeevi : చిరు 157 వ సినిమాలో విలన్ గా తెలుగు హీరో.. ఎవరో తెలుసుకోవాలని ఉందా..

Chiranjeevi : చిరంజీవి, ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీకి 1978 లో వచ్చారు. చిరు ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చారు. మెల్లమెల్లగా సినిమాలలో నటిస్తూ తన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఈయన అప్పట్లో స్టార్ హీరోలకు మంచి పోటీ ఇచ్చేవాడు. చిరంజీవి ( Rana as Villain Chiranjeevi 157 ) నటన, ఫైట్స్ మరియు డాన్స్ కు తెలుగు ప్రజలు ఆయన అభిమానులుగా మారిపోయారు. ఇలా చిరు స్టార్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. చిరంజీవి తన సినిమా కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు మరియు ఫ్లోప్స్ కూడా చెవిచూసాడు.

rana-is-acting-as-villain-in-chiranjeevi-157-film

ఈయన అవని పాటించుకోకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయారు. చిరంజీవి తన సత్తా చాటుకున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తరువాత చిరంజీవి నటన నుండి బ్రేక్ తీసుకొని ప్రజలకు సర్వీస్ చేద్దామని నమ్మి రాజకీయాలకు వెళ్ళాడు. ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి, ఎన్నికలలో పోటీ చేసి అపజయం అందుకున్నారు. ఆ తరువాత మల్లి సినిమాలోకి వచ్చారు. ఆయన సెకండ్ హాఫ్ లో ఖైదీ నెంబర్ 150 సినిమా చేసాడు. ఈ సినిమాను దర్శకత్వం వహించింది స్టార్ డైరెక్టర్ వివి వినాయక్. ఈ సినిమా కార్సియల్ సినిమా గ మంచి విజయం అందుకుంది.

ఆ తరువాత చిరంజీవికి అన్ని ఫ్లోప్స్ అనే చెప్పాలి. మొన్న విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా అయితే చిరు అనుకోనంత డిసాస్టర్ గా నిలిచింది. దీనితో ఈయన తన రాబోయే చిత్రాల మీద తన దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఈయన రీమేక్ లు పక్కన పెట్టి కుర్ర డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్నాడు. డైరెక్టర్ వసిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి 157 సినిమా చేస్తున్నారు. ఈ యంగ్ డైరెక్టర్ తన మొదటి చిత్రం బిమ్బిసార తో మంచ్చి విజయాన్ని సాధించాడు. చిరు తన 157 వ చిత్రానికి ఈ దర్శకుడిని లాక్ చేసారు మరియు ఇటీవల ఈ సినిమా యొక్క ఓపెనింగ్ పూజ కూడా అయ్యింది.

ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు ఎంఎం కీరవాణి. ఈయన ఇటీవల పోస్ట్ ద్వారా చిరు సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టారు అని తెలిపారు. ఇదిలా ఉంటె ప్రస్తుతం ఓ వార్తా సినిమా ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే, చిరు ( Rana as Villain Chiranjeevi 157 ) వసిష్ఠ సినిమా లో విలన్ గా టాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నాడంట. అవును మీరు వినేది నిజమే, చిరు 157 సినిమా ఫాంటసీ చిత్రం గా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో విలన్ గా చిరు సరసన రానా దగ్గుబాటి నటిస్తున్నాడంట. ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఎంత వరకు నిజమో తెలవాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా వేచి ఉండాలిసిందే. ఏదిఏమైనా చిరంజీవికి ఈ సినిమా అయినా మంచి విజయం సాధించి తన అభిమానులను సంతోష పరచాలని కోరుకుంటున్నాము.

Exit mobile version