Home Cinema Chiranjeevi-Balakrishna: చిరంజీవి బాలయ్య కాంబినేషన్ లో మిస్సైన భారీ మల్టిస్టార్రర్ అదేనా..?

Chiranjeevi-Balakrishna: చిరంజీవి బాలయ్య కాంబినేషన్ లో మిస్సైన భారీ మల్టిస్టార్రర్ అదేనా..?

Chiranjeevi Balakrishna Multistarrer: నిన్నటి తరం స్టార్ హీరోలలో టాప్ 2 ఎవరు అని అడిగితే కళ్ళు మూసుకొని ఎవరైనా చెప్పే పేర్లు మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ. బాక్స్ ఆఫీస్ వద్ద వీళ్ళిద్దరూ సుమారుగా నాలుగు దశాబ్దాల నుండి పోటీ పడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు మెగా స్టార్ చిరంజీవి బాలయ్య మీద పైచెయ్యి సాధిస్తే, మరికొన్ని సార్లు బాలయ్య బాబు చిరంజీవి మీద పై చెయ్యి సాధించేవాడు. వీళ్లిద్దరి మధ్య జరిగే బాక్స్ ఆఫీస్ వార్ చూసేందుకు చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభం లో కూడా సంక్రాంతి పోరులో ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలతో వీళ్లిద్దరి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

balakrishna-chiranjeevi-multistarrer

ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ పోటీలో మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ పై చెయ్యి సాధించడమే కాకుండా, టాలీవుడ్ టాప్ 5 హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిల్చింది. అయితే వీళ్లిద్దరి మధ్య బాక్స్ ఆఫీస్ పరంగా ఎంత పోటీ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరినొకరు ఎంతగానో అభిమానించుకుంటారు(Chiranjeevi Balakrishna Multistarrer). అయితే ఇప్పటి వరకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు ఒక్క మల్టిస్టార్రర్ సినిమా కూడా రాకపోవడం అభిమానులను కాస్త నిరాశకు గురి చేసిన విషయం. అయితే గతం లో ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్ర రావు, వీళ్ళిద్దరినీ పెట్టి ఒక సినిమా ప్లాన్ చేసాడు.

50 శాతం వరకు షూటింగ్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసారు. కానీ ఎందుకో చిరంజీవి ఈ చిత్రం నుండి కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన ఎందుకు తప్పుకున్నాడో ఇప్పటి వరకు ఎవరి దగ్గరా సమాచారం లేదు. అయితే చిరంజీవి తప్పుకోవడం తో ఆయన పాత్ర ని కూడా బాలయ్య బాబే పోషించి ద్విపాత్రిభినయం గా ‘అపూర్వ సహోదరులు’ అనే పేరు మీద విడుదల చేసారు. అప్పట్లో ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆరోజుల్లోనే ఈ సినిమా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించింది అట.

ఒకవేళ చిరంజీవి ఈ సినిమాలో నటించి ఉండుంటే కచ్చితంగా ఈ చిత్రం ఫుల్ రన్ లో అప్పట్లోనే పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి ఉండేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎం చేస్తాము బ్యాడ్ లక్, భవిష్యత్తులో అయినా వీళ్లిద్దరి కాంబినేషన్ సినిమా వస్తుందో లేదో చూడాలి. చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నారు, ఈ సినిమా 11 ఆగష్టు న రిలీజ్ అవ్వబోతుంది. అలానే బాలకృష్ణ వి ఈ ఏడాది 2 సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి, ఒకటి భగవత్ కేసరి, మరొకటి NBK 109. ఫాన్స్ మాత్రం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version