Home Cinema Chiranjeevi : నయా పైసా కూడా తీసుకోకుండా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు ఇవే..

Chiranjeevi : నయా పైసా కూడా తీసుకోకుండా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు ఇవే..

Chiranjeevi No Remuneration Movies : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి తారకరామారావు తర్వాత అత్యధిక సంవత్సరాలు నెంబర్ 1 హీరో గా కొనసాగిన స్టార్ మెగాస్టార్ చిరంజీవి. ఒకానొక దశలో ఆయన అభిమాని కానీ వాడంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాడు కాదు. ఒకేమూసలో వెళ్తున్న తెలుగు కమర్షియల్ సినిమాని సరికొత్త పుంతలు తొక్కించిన స్టార్ ఆయన. డ్యాన్స్ లో కానీ, కామెడీ టైమింగ్ లో కానీ, ఫైట్స్ లో కానీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని చిరంజీవి కి ముందు, చిరంజీవి కి తర్వాత అని విభజించవచ్చు.

chiranjeevi-no-remuneration-movies

ఆ రేంజ్ మార్పుని తీసుకొచ్చాడు ఆయన. అందుకే దశాబ్దాలు తరబడి ఇండస్ట్రీ లో నెంబర్ 1 గా కొనసాగుతున్నాడు, ఇప్పటికీ ఆయనకీ ఉన్నన్ని వంద కోట్ల రూపాయిల షేర్ సినిమాలు టాలీవుడ్ లో ఏ హీరో కి కూడా లేదు. ఇదంతా పక్కన పెడితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ కంటే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరో గా సరికొత్త చరిత్ర సృష్టించాడు మెగాస్టార్. అయితే చిరంజీవి చాలా సినిమాలకు ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక సినిమాకి 50 కంటే ఎక్కువ నష్టాలు వస్తే,చిరంజీవి తాను తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తం తిరిగి ఇచ్చేసేవాడట.

నిర్మాత శ్రేయస్సే తన శ్రేయస్సు గా భావించే ఆయన, ఇలాంటి పనులు చెయ్యడం వల్లే, ఇండస్ట్రీ లో ఆయనకీ అందరూ ఆ రేంజ్ గౌరవం ఇస్తారని అంటుంటారు. ఇప్పటి వరకు ఆయన మృగరాజు, బిగ్ బాస్ మరియు రీసెంట్ గా ఆచార్య సినిమాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తం తిరిగి ఇచ్చేశాడట. ఒక సినిమా చెయ్యాలంటే కనీసం మూడు నెలలు సమయం కేటాయించాలి, ఎంతో కష్టపడాలి, ఎన్నో టెన్సన్స్ ని స్వీకరించాలి. అన్ని కష్టాలు పడిన తర్వాత రెమ్యూనరేషన్ తీసుకోకపోతే చాలా బాధగా అనిపిస్తాది, కానీ చిరంజీవి ఒక సినిమా ఫ్లాప్ అయితే తన బాద్యతగానే తీసుకుంటాడట.

తనని నమ్ముకునే ఇంతమంది పని చేస్తున్నారు, సినిమా నేను ఒప్పుకోకపోతే అసలు ఉండేదే కాదు, నేను ఒప్పుకున్నని కాబట్టి పూర్తి బాధ్యత నాదే అని అనుకునే రకం ఆయన. రీసెంట్ గా ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి గ్రాండ్ హిట్ కొట్టి ఇండస్ట్రీ ని షేక్ చేసిన మెగాస్టార్ , ఇప్పుడు ‘భోళా శంకర్’ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు(Chiranjeevi No Remuneration Movies). రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ఆగస్టు 11 వ తారీఖున విడుదల కాబోతుంది.

Exit mobile version