Home Cinema Manchu Manoj : మంచు మనోజ్ భార్య మౌనిక ని టార్చర్ పెడుతున్న మంచు లక్ష్మి..

Manchu Manoj : మంచు మనోజ్ భార్య మౌనిక ని టార్చర్ పెడుతున్న మంచు లక్ష్మి..

Manchu Manoj Mounika : మంచు కుటుంబం లో ఉన్న హీరోలకు సోషల్ మీడియా లో నెగటివిటీ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు ఈ ఫ్యామిలీ హీరోలు. ఆడియన్స్ కి చాలా చిరాకు కలిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే వీరిలో మంచు మనోజ్ కి మాత్రం సోషల్ మీడియా లో అసలు నెగటివిటీ అనేదే లేదు. ఇతను మాట్లాడే మాటలు, నలుగురితో వ్యవహరించే తీరు అందరికీ ఎంతో బాగా నచ్చుతుంది. వీటి అన్నిటికీ తోడు సమాజం లో జరిగే అన్యాయాలపై మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి వినిపించే మొట్టమొదటి గొంతు మంచు మనోజ్ మాత్రమే.

manchu-lakshmi-bhuma-mounika

అతని ఆవేదన లో నిజాయితీ కనిపిస్తుంది. ఇతను ప్రసంగాలు కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక పోతే రీసెంట్ గానే ఆయన భూమా మౌనిక రెడ్డి ని ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి పెళ్లి చెయ్యడం కోసం మంచు లక్ష్మి పెద్ద యుద్ధమే చేసిందట. పెళ్లి అయ్యేవరకు ఆమె తనతోనే వీళ్ళిద్దరినీ ఉంచుకుందట, పెళ్లి తర్వాత సెపరేట్ గా ఉంటున్నారట. సుమారుగా నాలుగేళ్ల నుండి డేటింగ్ చేసుకుంటున్న ఈ జంట, మొత్తానికి రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా మంచు లక్ష్మి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో వీళ్లిద్దరి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

ఆమె మాట్లాడుతూ ‘మౌనిక కి చాలా విషయాలు తెలియవు, పెళ్లి తర్వాత ఆమె ప్రతీ చిన్న విషయానికి ఇది ఎలా చెయ్యాలి అది ఎలా చెయ్యాలి అని ఫోన్ చేసి అడిగేది. పెళ్ళికి ముందు నాకు ఏరోజైనా ఇన్ని సార్లు కాల్ చేసావా, నేను చెప్పను పో అని ఆమెని తెగ టార్చర్ చేసేదానిని. కానీ మౌనిక చాలా మంచి అమ్మాయి, ఆమెకి ఉన్నంత ఓపిక సహనం గుణాలు ఇప్పటి వరకు నా జీవితం లో ఎవరి దగ్గర చూడలేదు. మనోజ్ నిజంగా చాలా అదృష్టవంతుడు’ అని చెప్పుకొచ్చింది. ఇక మనోజ్ చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఆయన ‘వాట్ ది ఫిష్’ అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. అతి త్వరలోనే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించుకోబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది గ్రాండ్ గా విడుదల కాబోతుంది. మంచు మనోజ్ మౌనిక మార్చ్ 3 న వివాహం చేసుకున్నారు(Manchu Manoj Mounika). మౌనిక భూమా నాగి రెడ్డి అనే ఒక పెద్ద రాజకీయ నాయకుడి కూతురు.

Exit mobile version