Home Cinema Naga Chaitanya : పెళ్ళైన హీరోయిన్ తో ప్రేమాయణం నడిపిన నాగ చైతన్య..

Naga Chaitanya : పెళ్ళైన హీరోయిన్ తో ప్రేమాయణం నడిపిన నాగ చైతన్య..

Naga Chaitanya Affair: అక్కినేని నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగ చైతన్య, తన తండ్రి పలుకుబడిని ఏమాత్రం ఉపయోగించుకోకుండా తన సొంత టాలెంట్ తో సరికొత్త కథలను ఎంచుకుంటూ హిట్టు మీద హిట్టు కొట్టి టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే ఈయన ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్నాళ్ళు దాంపత్య జీవితం కొనసాగించిన వీళ్లిద్దరు కొన్ని విభేదాలు కారణం గా విడిపోవాల్సి వచ్చింది. విడిపోయిన రోజు నుండి ఇప్పటి వరకు వీళ్లిద్దరి గురించి సోషల్ మీడియా లో ఎదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంది.

naga-chaitanya-affair

రీసెంట్ గా నాగ చైతన్య గురించి ప్రచారం అవుతున్న ఒక వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అదేంటో ఒకసారి మనం కూడా చూద్దాము. ఇక అసలు విషయానికి వస్తే నాగ చైతన్య సమంత కంటే ముందే ఒక స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడట. ఆ హీరోయిన్ మరెవరో కాదు, కాజల్ అగర్వాల్(Naga Chaitanya Affair). వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతం లో ‘దడ’ అనే చిత్రం వచ్చింది మరి. అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ కాజల్ అగర్వాల్ మరియు నాగ చైతన్య మధ్య అప్పట్లో ప్రేమాయణం నడిచిందని, వీళ్లిద్దరూ కలిసి రెగ్యులర్ గా పార్టీలకు, పబ్బులకు కలిసి వెళ్ళేవారని, అప్పట్లో కెమెరాలకు కూడా బాగా చిక్కారని వార్తలు వచ్చాయి.

మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ, కాజల్ అగర్వాల్ ఇప్పుడు గౌతమ్ అనే అతనిని పెళ్లి చేసుకోని ఒక బిడ్డకి జన్మని ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక నాగ చైతన్య సమంత తో విడిపోయిన తర్వాత శోభిత దూలిపాళ్ళ తో ప్రేమాయణం నడుపుతున్నట్టు వార్తలు వచ్చాయి కానీ, దీని నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరో ఆయన రెండవ పెళ్లి గురించి సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో చూడాలి. ఇక నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చందు మొండేటితో ఒక సినిమా చేస్తున్నాడు. గీత ఆర్ట్స్ తెరకెక్కించే ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.

ఈ సినిమాలో నాగ చైతన్య జాలరి పాత్రలో కనిపించబోతున్నాడు. వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన నాగ చైతన్య ఈ సినిమా తో బౌన్స్ బ్యాక్ అవుతాడని అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. నాగ చైతన్య ఐతే ప్రస్తుతం ఏ సినిమాలు లేక కాలిగా ఉన్నాడు మరో పక్క సమంత ఏమో సినిమాలు మీద సినిమాలు చేస్తుంది. నాగ చైతన్య ఇప్పటికైనా మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలి అని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Exit mobile version