Home Cinema Samantha : పక్కలోకి రా అని సమంతను పిలిచిన ఆ డైరెక్టర్ ఎవరంటే..

Samantha : పక్కలోకి రా అని సమంతను పిలిచిన ఆ డైరెక్టర్ ఎవరంటే..

Samantha Casting Couch: సౌత్ ఇండియా లో ఎప్పటి నుండో కాస్టింగ్ కౌచ్ సమస్య ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద హీరోయిన్స్ సైతం ఈ విషయం పై మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ ఇమేజి ఉన్న సమంత లాంటి హీరోయిన్ కి కూడా ఈ కాస్టింగ్ కౌచ్ కి గురి అయ్యిందంటే నమ్ముతారా..? కానీ నమ్మాలి ఎందుకంటే అది పచ్చి నిజం కాబట్టి. ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో సమంత యాడ్స్ ఎక్కువగా చేసేది. సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో రోజులు స్టూడియోల చుట్టూ తిరిగిన ఆమెకి యాడ్స్ లో నటించే ఛాన్స్ దొరికే సరికి పట్టరాని ఆనందం వచ్చిందట.

smantha-about-casting-couch

ఆ యాడ్స్ ఇప్పటికే సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇకపోతే ఈమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కాస్టింగ్ కౌచ్ గురించి అడిగిన ప్రశ్నలకు చెప్పిన కొన్ని సమాదానాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఆమెని ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో ఒక యాడ్ డైరెక్టర్ కోరిక తీరిస్తే సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు ఇప్పిస్తాను అని అన్నాడట(Samantha Casting Couch). కానీ సమంత అందుకు ఒప్పుకోలేదు, ఇండస్ట్రీ అంటే ఇంత నీచంగా ఉంటుందా అనే ఉద్దేశ్యం తో ఆమె సినిమాల నుండి తప్పుకొని కొన్ని రోజులు చెన్నై లోనే కాల్ సెంటర్స్ లో జాబ్ చేసుకుంటూ ఉండేదట.

కానీ సినిమాలే ఆమెని వెతుక్కుంటూ వచ్చాయి. యాడ్స్ లో సమంత అభినయం ని చూసి ఎంతో ముగ్దుడైన గౌతమ్ మీనన్ ‘ఏం మాయ చేసావే’ అనే సినిమా లో హీరోయిన్ ఆఫర్ ని ఇచ్చాడు. వచ్చిన అద్భుతమైన అవకాశం ని ఉపయోగించుకున్న సమంత ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి అనతి కాలం లోనే సూపర్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తే కచ్చితంగా కొంతమంది మీడియం రేంజ్ హీరోలతో సరిసమానమైన కల్లెక్షన్స్ వస్తాయి.

ఇకపోతే సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ‘ఖుషి’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. ‘శాకుంతలం’ తో భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్న సమంత ఈ బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి. సమంత ప్రస్తుతం సినిమాల నుండి విరామం తీసుకుని బాలి దేశం లో స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంది. సమంత తన ఫ్రెండ్ తో బాలిలో చేసిన ఒక డాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ విరామం తరువాత కొద్దిగా తన ఆరోగ్యం సరిచేసుకుని మల్లి సినిమాల్లోకి తిరిగి వస్తుంది సమంత.

Exit mobile version