Home Cinema Nithin : నితిన్ ను రష్మిక అందుకే రిజెక్ట్ చేసిందా.. నిజమేంటో చెప్పేసిన నటి..

Nithin : నితిన్ ను రష్మిక అందుకే రిజెక్ట్ చేసిందా.. నిజమేంటో చెప్పేసిన నటి..

Nithin : కిర్రాక్ పార్టీ సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది రష్మిక. ఛలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. అమ్మడు నటించిన ప్రతి సినిమా హిట్ కావడంతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’, మహేశ్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్(Nithin Rashmika Mandanna) తో ‘భీష్మ’ వంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేసింది. ఇక అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి నేషనల్ క్రష్ అయిపోయింది.

did-really-rashmika-mandanna-rejected-movie-with-nithin

దీంతో ముద్దు గుమ్మ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. అమ్మడి ఇంటి ముందు మా సినిమాల్లో నటించాలంటూ నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఆ మధ్య యంగ్ స్టార్ నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించారు. ఇందులో ర‌ష్మిక న‌టిస్తుంద‌ని అఫీషియల్ గానే ప్రకటించారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఈ ఏడాది మార్చిలోనే పూర్తయింది. ఇది ఇలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ర‌ష్మిక త‌ప్పుకుంద‌నే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ప్రస్తుతం ర‌ష్మిక ‘పుష్ప 2’ సినిమాతో పాటు బాలీవుడ్‌లో ర‌ణ్‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న ‘యానిమ‌ల్’ చిత్రంలో నటిస్తోంది. వాటితో తమిళ్, తెలుగు బై లింగ్యువల్ ప్రాజెక్ట్ అయిన ‘రెయిన్‌ బో’ చిత్రంలోనూ నటిస్తోంది. ఇవి కాకుండా రష్మిక చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. వాటిపై అమ్మడు ఇటీవల సంతకాలు కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే నితిన్‌-వెంకీ కుడుముల సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయిందట. దీంతో చిత్ర యూనిట్ తో చర్చించి ఆ సినిమా నుంచి రష్మిక తప్పుకున్నట్లు వార్త వినిపిస్తోంది.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మిక తప్పుకోవడంతో మ‌రో హీరోయిన్ వేట‌లో చిత్ర బృందం ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ర‌ష్మిక త‌ప్పుకోవ‌డంతో శ్రీలీల చిత్రాన్ని ఒప్పుకునే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇది ఇలా ఉంటే… రష్మిక ఈ వార్తలపై స్పందించింది. ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఇలాంటి వార్తలను ప్రచారం చేసే ముందు అధికారికంగా ఎవరైనా సమాచారం ఇస్తేనే ఇలా చేయాలని సూచించారు.

అలాంటిదేమీ లేదు కాబట్టి ఆ వార్తలు ఖచ్చితంగా అబద్ధం అని రష్మిక(Nithin Rashmika Mandanna) ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే రష్మిక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారన్న ప్రశ్న ఎదురైంది. ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచన లేదని.. ఇంకా అందుకు చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చింది.

Exit mobile version