Home Cinema Chiranjeevi: చిరంజీవి చేతికి పెట్టుకున్న వాచ్ ఖరీదు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

Chiranjeevi: చిరంజీవి చేతికి పెట్టుకున్న వాచ్ ఖరీదు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

Chiranjeevi: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు కొణిదెల శివశంకర వరప్రసాద్. స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ అయ్యారు. చిరంజీవిగా(Chiranjeevi Costly Watch) ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించారు. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా మారారు. ఆయనను ఇన్సిపిరేషన్ గా తీసుకుని ఎంతో మంది సినిమాల్లోకి వస్తున్నారు. ఎంతోమందికి చిరంజీవి ఆదర్శం.

chiranjeevi-papped-with-his-luxury-watch-its-cost-will-blow-everyone-mind

ఈ క్రమంలోనే నిన్న రక్షాబంధన్ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి ఇంట కూడా రాఖీ పండుగా చాలా వైభవంగా జరిగింది. చిరంజీవికి, ఆయన సోదరులకు వారి ఆడపడుచులు రాఖీలు కట్టీ ఆశీర్వాదం తీసుకున్నారు. చిరంజీవి ప్రతేడాది తన చెల్లెల్లతో రాఖీ పండుగను చాలా అట్టహాసంగా జరుపుకోవడం తన అభిమానులు కూడా చూడాలని కోరుకుంటారన్న విషయం అందరికీ తెలుసు.

అందుకే ప్రతి సంవత్సరం తన చెల్లెళ్లు తనకు రాఖీ కడుతుండగా వీడియో తీసి షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా తీసిన వీడియో నెట్లింట్లో హల్ చల్ అవుతోంది. తాజాగా షేర్ చేసిన వీడియోలో మెగాస్టార్ తండ్రి వెంకట్ రావు , పిల్లనిచ్చిన మామ అల్లు రామలింగయ్య ఫోటోలను పూజ గదిలో ఉంచి దేవుళ్లతో సమానంగా చిరంజీవి పూజిస్తుండడం చూసిన నెటిజన్లు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ వీడియోలో చిరంజీవికి సంబంధించిన మరో వస్తువు గురించి నెట్టింట్లో చర్చనీయాంశమైంది.

అది మరేదో కాదు.. చిరంజీవి తన చేతికి పెట్టుకున్న వాచ్. వాచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. మెగాస్టార్ తన చేతికి పెట్టుకున్న వాచ్ రోలెక్స్ కంపెనీకి చెందినది. సహజంగా ఆ కంపెనీలకు చెందిన వాచ్ ల ధర అధికంగానే ఉంటుంది. దీంతో ఆ వాచ్ ధర ఎంతో తెలుసుకోవాలని ఆయన అభిమానులు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఆయన అభిమానులు వాచ్ ధరను పసిగట్టేశారు. దాని ధర 2.35 లక్షలు డాలర్లు.. మన ఇండియా కరెన్సీలో సుమారుగా రూ .2కోట్లు అట.

ఇక ఈ వాచ్ ధర తెలిసిన జనాలంతా నోరెళ్ల బెడుతున్నారు. నిజానికి చిరంజీవికి(Chiranjeevi Costly Watch) కార్లు కొనడం అంటే ఎంత ఇష్టమో.. పలు రకాల వాచ్ లను కొనడం కూడా అంతే ఇష్టమని ఓ ఇంటర్య్వూలో చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే మెగాస్టార్ దగ్గర భారీగా కారు కలెక్షన్లతో పాటు వాచ్ కలెక్షన్లు కూడా ఉంటాయి. ఏది ఏమైనా చిరంజీవి ధరించిన వాచ్ ధర విని మీరు కూడా షాక్ తిన్నారు కదూ.

Exit mobile version