Home Cinema Taapsee : నటి తాప్సి ఇంత మంది హీరోలతో ప్రేమాయణం నడిపిందా.. పెద్ద లిస్ట్ ఏ..

Taapsee : నటి తాప్సి ఇంత మంది హీరోలతో ప్రేమాయణం నడిపిందా.. పెద్ద లిస్ట్ ఏ..

Taapsee Pannu : బాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలనే కళతో మోడలింగ్ రంగం లోకి అడుగుపెట్టి, ఆ తర్వాత బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చిన ఢిల్లీ బ్యూటీ తాప్సి ఒక్క సినిమాకి కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వలేదు. దీనితో ఆమె బాలీవుడ్ నుండి టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇక్కడ రాఘవేంద్ర రావు దర్శకత్వం లో మంచు మనోజ్ హీరో గా నటించిన ‘ఝుమంది నాదం’ అనే మ్యూజికల్ చిత్రం లో హీరోయిన్ గా నటించి, తొలిసినిమాతోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ మరియు కోలీవుడ్ లలో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా చేసే అవకాశాలు కొట్టేసిన తాప్సి అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.

Taapsee-pannu

అప్పుడు ఆమె బాలీవుడ్ లో అవకాశాలు దక్కాయి. అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ ఎన్నో సూపర్ హిట్స్ ని అందుకొని అగ్ర కథానాయికగా ఇండస్ట్రీ లో స్థిరపడిపోయింది. ఇదంతా పక్కన పెడితే తాప్సి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత టాలీవుడ్ , కోలీవుడ్ మరియు బాలీవుడ్ హీరోలతో ఎన్నో అఫైర్స్ నడిపింది. అప్పట్లో ఈమె టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి(Taapsee Pannu). అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని, ఈ వార్త విన్న తర్వాత మేమిద్దరం పగలబడి నవ్వుకున్నాం అంటూ మనోజ్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత ఈమె తమిళం లో హీరో ఆర్య తో రెండేళ్ల పాటు ప్రేమాయణం నడిపి, ఆ తర్వాత కొన్ని కారణాల చేత బ్రేకప్ అవ్వాల్సి వచ్చిందని ఒక రూమర్ ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ బడా హీరో అక్షయ్ కుమార్ తో మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన తాప్సి అతని తో కూడా డేటింగ్ చేస్తున్నట్టుగా బి టౌన్ మొత్తం ఒక రూమర్ ప్రచారం అయ్యింది. అయితే మేమిద్దరం కేవలం సినిమాల ప్రమోషన్స్ కోసమే సన్నిహితంగా ఉన్నామని చెప్పడం తో ఆ రూమర్స్ కి బ్రేక్ పడింది. ఆ తర్వాత మహత్ రాఘవేంద్ర, సంకీప్ సలీం వంటి హీరోలతో కూడా ప్రేమాయణం లో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది.

ఇక చివరికి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బోయ్ తో ప్రేమాయణం నడుపుతూ అతనితో స్థిరపడింది. ఈ విషయాన్నీ స్వయంగా మాథియాస్ ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న వీళ్లిద్దరు అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. తాప్సి ప్రస్తుతం డుంకి అనే సినిమాలో నటిస్తుంది, ఈ బాలీవుడ్ సినిమాలో షా రుఖ్ ఖాన్ హీరో గా రాజ్ కుమార్ హిరానీ దార్శకత్వం వహిస్తున్నాడు. చూదాం ఈ బామ్మకు ఇపటికైనా హిట్ కొడుతోంది ఏమో.

Exit mobile version