Home Cinema Pawan Kalyan : మల్లి విడాకులు తీసుకోబోతున్న పవన్ కళ్యాణ్..? ఒక్క ఫొటోతో ఫుల్ క్లారిటీ..

Pawan Kalyan : మల్లి విడాకులు తీసుకోబోతున్న పవన్ కళ్యాణ్..? ఒక్క ఫొటోతో ఫుల్ క్లారిటీ..

Pawan Kalyan Divorce : గత రెండు మూడు రోజుల నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నా లెజినావా తో సోషల్ మీడియా లో వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పుకార్లు పుట్టించింది మరెవరివో కాదు, వైసీపీ పార్టీ కి సన్నిహితంగా ఉంటే పలు వెబ్ సైట్లు. వాళ్లకి కేవలం లోకల్ మీడియా మాత్రమే కాదు , నేషనల్ మీడియా తో కూడా సంబంధాలు ఉన్నాయని గడిచిన రెండు మూడు రోజులు చూస్తే అర్థం అవుతుంది. ఒక్కసారి గూగుల్ లో పవన్ కళ్యాణ్ అనే కీ వర్డ్ తో వెతికితే ఆయన మీద పుట్టించిన ఈ పుకార్లే ఎక్కువగా కనిపిస్తుంటాయి.

pawan-kalyan-divorce-with-anna-lezhneva

నేషనల్ మీడియా కూడా ఈ వార్తలను ప్రచురించడం తో కొంతమంది అభిమానులు కూడా ఇది నిజమేనేమో అని అనుకున్నారు. కానీ 24 గంటలు కూడా తిరగకుండానే పవన్ కళ్యాణ్ వాళ్ళందరి నోర్లను ముయ్యిస్తూ(Pawan Kalyan Divorce), జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్ నుండి ఒక ట్వీట్ వేయించాడు. దీనికి సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది, చాలా సింపుల్ గా ఎలాంటి రాజకీయ విమర్శ చెయ్యకుండా, కేవలం తన ఇంట్లో ‘వారాహి విజయ యాత్ర ‘ మొదటి అంకం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా తన సతీమణి అన్నా లెజినావా తో కలిసి పూజలు నిర్వహించినట్టుగా,

త్వరలోనే ‘వారాహి విజయ యాత్ర’ రెండవ విడత కి సంబంధించిన కార్యాచరణ గురించి నాయకులతో చర్చలు జరిపేందుకు మంగళగిరి కి రాబోతున్నట్టుగా జనసేన పార్టీ తరుపున పవన్ కళ్యాణ్ అన్నా లెజినావా తో కలిసి ఉన్న లేటెస్ట్ ఫోటోని విడుదల చేసారు. కర్ర విరగలేదు , పాము చావలేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహరించిన ఈ తీరుకి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. రెండు రోజులుగా లక్షల రూపాయిలను కుమ్మరించి, పవన్ కళ్యాణ్ మీద చేసిన దుష్ప్రచారం మొత్తం వృధా అయ్యింది అని వైసీపీ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా లో మరో కొత్త కథతో ముందుకు వచ్చారు.

పవన్ కళ్యాణ్ అన్నా లెజినావా కలిసి ఉన్న ఫోటో కొత్తది కాదని, ఒకవేళ అది నిజంగా కొత్తదే అయితే , వీడియో పెట్టాలి అంటూ మరో కొత్త ప్రచారం మొదలు పెట్టారు. వైసీపీ కార్యకర్తలు చేస్తున్న ఈ దిగజారుడు రాజకీయాలను కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా గాండ్రించి ఊస్తున్నారు సోషల్ మీడియా లో. ఇంతకి మీ అభిప్రాయం ఏంటి.? పవన్ నిజంగానే విడాకులు తీసుకోబోతున్నాడా? మేము మాత్రం కాదు అనే భావిస్తున్నాము.

Exit mobile version