Home Cinema Mahesh Babu Marriage: మహేష్ బాబు పెళ్ళికి త్రిష కి ఉన్న సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Mahesh Babu Marriage: మహేష్ బాబు పెళ్ళికి త్రిష కి ఉన్న సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Mahesh Babu Marriage: సౌత్ ఇండియా లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న మహేష్ బాబు – నమ్రత జంట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇలాంటి దంపతులను ఆదర్శంగా తీసుకుంటే లోకం లో ఎక్కడ కూడా విడాకులు అన్న మాటే ఉండదని అంటుంటారు అభిమానులు. సంవత్సరం లో మహేష్ బాబు వంద రోజులు షూటింగ్ లో ఉంటే, మిగిలిన రోజులన్నీ తన కుటుంబానికే కేటాయిస్తాడు. వరల్డ్ టూర్స్ వేసి మంచిగా కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంత జాలీ లైఫ్ ని ఎంజాయ్ చేసే హీరో ఏ ఇండస్ట్రీ లో కూడా ఉండదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

mahesh-babu-namratha-marriage-trisha

అయితే వీళ్లిద్దరి పెళ్లి ఎంతో నాటకీయ కోణం లో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. కృష్ణ గారి అబ్బాయి పెళ్లి అంటే ధూమ్ ధామ్ గా జరగాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. కానీ మహేష్ బాబు పెళ్లి మాత్రం కేవలం కుటుంబ సభ్యుల సమక్షం లో చాలా సింపుల్ గా జరిగింది. అంత సింపుల్ గా మహేష్ – నమ్రత వివాహం జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అయితే వాళ్ళ పెళ్లి అంత అర్జెంటు గా జరుపుకోవడానికి కారణం ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష అని అప్పట్లో ఒక రూమర్ ఉండేది. అసలు విషయం లోకి వెళ్తే మహేష్ బాబు మరియు త్రిష కాంబినేషన్ లో ‘అతడు’,’సైనికుడు’ వంటి సినిమాలు వచ్చాయి.

ఈ రెండు సినిమాల్లో ఈ జంట కి ఆన్ స్క్రీన్ పై మంచి మార్కులే పడ్డాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది అంటూ అప్పట్లో రివ్యూస్ కూడా వచ్చాయి. అదే సమయం లో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం కూడా నడిచింది అంటూ అప్పట్లో ఒక రూమర్ ఉండేది. మహేష్ – త్రిష డేటింగ్ లో ఉన్నారని, నమ్రత తో మహేష్ కి బ్రేకప్ అయ్యింది అంటూ వార్తలు వినిపించాయి(Mahesh Babu Marriage). నమ్రత కూడా అప్పట్లో త్రిష తో డేటింగ్ చేస్తున్నాడు అనే వార్తని బలంగా నమ్మింది అట. మహేష్ తో విబేధాలు కూడా ఏర్పడ్డాయి అట.

దాంతో వెంటనే పెళ్లి చేసుకోవాలి అని పట్టుబట్టడం తో అతడు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఇండస్ట్రీ లో ఒక రూమర్ ఉంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు మహేష్ – త్రిష మంచి స్నేహితులు మాత్రమే అని, వాళ్ళ మధ్య మరో రిలేషన్ లేదని అర్థం చేసుకోవడం తో సైనికుడు చిత్రం లో మహేష్ సరసన నటించేందుకు ఒప్పుకుందట. మహేష్ బాబు గుంటూరు కారం వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాల్సి ఉంది, కానీ అది వాయిదా పడే సంకేతాలు చాల ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనితో ఫాన్స్ ట్విట్టర్ లో త్రివిక్రమ్ పై విరుచుకు పడుతున్నారు.

Exit mobile version