Home Cinema Trisha : అందంగా కనిపించేందుకు ప్రాణాలను రిస్క్ లో పెట్టిన హీరోయిన్ త్రిష..ఇంత ఓవర్ యాక్షన్...

Trisha : అందంగా కనిపించేందుకు ప్రాణాలను రిస్క్ లో పెట్టిన హీరోయిన్ త్రిష..ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా..?

Trisha : తెలుగు మరియు తమిళం బాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి దాదాపుగా స్టార్ హీరోలందరినీ కవర్ చేసిన హీరోయిన్ త్రిష కృష్ణన్. ఈమె సుమారుగా దశాబ్దంకి పైగానే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ సౌత్ లో నెంబర్ 1 హీరోయిన్ గా నిల్చింది. మన చిన్నతనం లో ఉన్నప్పుడు ఈమె అప్పటి స్టార్ హీరోల సరసన నటిస్తూ ఉండేది. ఇప్పుడు కూడా నేటి తరం స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తూ నాలుగు పదుల వయస్సులో కూడా కుర్ర హీరోయిన్స్ తో పోటీ పడుతుంది.

trisha-dared-her-life-to-look-beautiful

రీసెంట్ గానే పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో గ్రాండ్ హిట్ ని అందుకున్న ఈ హాట్ బ్యూటీ, తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి ‘లియో‘ అనే చిత్రం లో నటిస్తుంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది ఇలా ఉండగా త్రిష మిగిలిన హీరోయిన్స్ లాగా పెద్దగా వర్కౌట్స్ లాంటివి ఏమి చెయ్యదు. అయ్యినప్పటికీ కూడా నాలుగు పదుల వయస్సు దాటినట్టు ఆమె ముఖం లో ఇసుమంత కూడా కనిపించకపోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.

ఎలా ఇంత అందం మైంటైన్ చేస్తుంది అనే రహశ్యం ఇప్పుడు బయటపడిపోయింది. ఈమె ముఖం లో ముడతలు రాకుండా ఉండెదనుకు ఒక ఇంజక్షన్ ని ప్రతీ రోజు ఒక మోతాదు దోసేజి లో తీసుకుంటుందని. ఈ ఇంజెక్షన్స్ ప్రభావం ప్రస్తుతానికి ఏమి కనపడకపోయిన భవిష్యత్తులో చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని. సహజ పద్దతిలోనే అందాన్ని మైంటైన్ చెయ్యడం మంచిదని, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అంటూ సోషల్ మీడియా లో అభిమానులు మరియు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరి సోషల్ మీడియా లో తరచూ యాక్టీవ్ ఉండే త్రిష ఈ కామెంట్స్ పై స్పందిస్తుందో లేదో చూడాలి. ఇకపోతే రీసెంట్ గానే ఈమె మెగాస్టార్ చిరంజీవి – కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కబోయ్యే సినిమాలో(Trisha) హీరోయిన్ గా నటించడానికి సంతకం చేసిందట. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘స్టాలిన్’ అనే చిత్రం వచ్చింది.

ఈ సినిమా కమర్షియల్ గా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. ఇప్పుడు మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ చిత్రం లో సిద్దులు జొన్నలగడ్డ-శ్రీలీల కూడా నటిస్తున్నారు.

Exit mobile version