Home Cinema Kannappa Girl : కన్నప్ప ట్రైలర్ లో ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఎవరంటే..

Kannappa Girl : కన్నప్ప ట్రైలర్ లో ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఎవరంటే..

Kannappa Girl : ఎక్కడ చూసినా కన్నప్ప సినిమాలో ఫైటర్‌గా పాపులారిటీ తెచ్చుకున్న అమ్మాయి చిత్రాలే ట్రెండింగ్‌లో ఉన్నాయి. మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నప్ప చిత్రాన్ని డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నాడని మనకు తెలుసు. మహాభారత నటుడు ముఖేష్ కుమార్ ఈ చిత్రాన్ని దర్శకిస్తున్నారు. మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆల్-ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంపికైన తారలు వీరే.

ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు, శివరాజ్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, మధుబాల, కాజల్ అగర్వాల్ నటించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఈ టీజర్‌లో తప్పులు దొర్లాయని ట్రోల్ చేస్తున్నారు. అయితే అందరికి ఈ ట్రైలర్ లో బాగా ఫైట్ చేసిన అమ్మాయి ఆకర్షణీయంగా కనిపించింది. అమ్మాయి గురించి వెతకడం మొదలుపెట్టారు, ఆమె చాలా ఆకర్షణీయంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

did-you-know-who-is-this-girl-in-kannappa-cinema-trailer

ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ అమ్మాయి ఎవరో కాదు ప్రీతి ముకుందన్. ప్రీతి ముకుందన్ క్యాడ్‌బరీ డైరీ మిల్క్ వంటి వివిధ యాడ్స్ ప్రకటనలలో కనిపించిన తర్వాత కీర్తిని పొందింది. తాజాగా ఆమె కోలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలో నటించింది. ఆమెకు అక్కడ గొప్ప గుర్తింపు వచ్చింది. ప్రీతి ముకుందన్ రీసెంట్ గా యంగ్ హీరో శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ సినిమాలో నటించింది. ఇప్పుడు కన్నప్ప పాన్ ఇండియా స్థాయిలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు.

Exit mobile version