Home Cinema Prabhas : వైఎస్ షర్మిలకు ప్రభాస్ నటించిన ఆ సినిమాకి సంబంధం ఏంటి..?

Prabhas : వైఎస్ షర్మిలకు ప్రభాస్ నటించిన ఆ సినిమాకి సంబంధం ఏంటి..?

Prabhas Ys Sharmila : టాలీవుడ్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో సినిమాలు చేసే అవకాశం వస్తే ఏ దర్శక నిర్మాతలకు అయినా ఒక వరం లాగ భావిస్తారు. ఎందుకంటే ప్రభాస్ బాహుబలి చిత్రం తర్వాత పాన్ వరల్డ్ స్టార్, ఆయనని హీరో గా పెట్టి సినిమాలు తియ్యడానికి వేల కోట్ల రూపాయిల బడ్జెట్స్ ని పెడుతుంటారు. ఎందుకంటే ఆయన సినిమాలు ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ఉంటాయి. అదే ఒకవేళ హిట్ అయ్యిందంటే ఆ నిర్మాతకి మరో నాలుగు బాహుబలి లాంటి సినిమాలను నిర్మించేంత డబ్బులు వస్తాయి.

prabhas-sharmila

అందుకే ప్రభాస్ సినిమాలు ఈమధ్య వరుసగా ఫ్లాప్ అవుతున్నా కూడా భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నారు. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘ఆదిపురుష్ ‘ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ 400 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. ఇది ఇలా ఉండగా ప్రభాస్ తో సినిమాలు చెయ్యడానికి పలువురు ప్రముఖ రాజకీయ నాయకులూ కూడా ఎంతో ఉత్సాహం ని చూపిస్తూ ఉంటారు. అలా గతం లో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల కూడా ప్రభాస్ తో ఒక సినిమా నిర్మించింది. ఆ సినిమా పేరు యోగి, వీవీ వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడం తో కలెక్షన్స్ పరంగా కూడా పెద్ద ఫ్లాప్ అయ్యింది. దాంతో నిర్మాత షర్మిల కి భారీ నష్టాలు వచ్చాయి(Prabhas Ys Sharmila). ఈ సినిమా మిగిల్చిన అనుభవం తో మళ్ళీ ఆమె సినీ ఇండస్ట్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే ఈ సినిమా సమయం లోనే ప్రభాస్ – షర్మిల ప్రేమించుకుంటున్నారని, షర్మిలతో ప్రభాస్ పెళ్ళికి ఒప్పుకోకపోవడం తో జగన్ ప్రభాస్ ని కొట్టించాడు అంటూ వార్తలు కూడా వినిపించాయి. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అటు షర్మిల, ఇటు ప్రభాస్ క్లారిటీ కూడా ఇచ్చారు.

ఇప్పుడు ప్రభాస్ పాన్ వరల్డ్ సూపర్ స్టార్ కాబట్టి మళ్ళీ ఆమె ప్రభాస్ తో సినిమా నిర్మించే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రభాస్ వి గత 3 సినిమాలు అట్టర్ ప్లాప్ అవ్వటంతో ప్రభాస్ ఫాన్స్ ఒక మంచి సినిమా ఆకలిలో ఉన్నారు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిసాస్టర్ కావటంతో ప్రభాస్ ఫాన్స్ కోడిగా భయంలో ఉన్నారు. వారి ఆశలు అని సాలార్ సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని చాల నమ్మకంతో ఉన్నారు ఫాన్స్. ఈ సినిమా వచ్చే నెల రిలీజ్ కానుంది, ఈ సినిమా ప్రభాస్ కి కంబ్యాక్ ఇస్తుంది అంటారా.?

Exit mobile version