Home Cinema Venkatesh : అందరూ చూస్తుండగానే ఆ హీరోయిన్ కి చీర కట్టిన వెంకటేష్.. ఎవరికంటే..

Venkatesh : అందరూ చూస్తుండగానే ఆ హీరోయిన్ కి చీర కట్టిన వెంకటేష్.. ఎవరికంటే..

Venkatesh : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో శోభన్ బాబు తర్వాత ఆ రేంజ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో విక్టరీ వెంకటేష్. ఆయన ఇప్పటి వరకు 74 సినిమాలు చేస్తే అందులో 80 శాతం సక్సెస్ రేట్ ఉంది. అందుకే వెంకటేష్ ని విక్టరీ వెంకటేష్ అని పిలుస్తారు. మాస్, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే విధంగా ఆయన ఇది వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఇప్పటికీ కూడా ఆయన సినిమా హిట్ అయ్యిందంటే ఫుల్ రన్ లో నేటి తరం స్టార్ హీరోలకు సరిసమానమైన ఓపెనింగ్స్ వస్తుంటాయి. అంతే కాదు, వెంకటేష్ తన సినిమాల ద్వారా ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.

aarthi-agarwal-Venkatesh

దివ్య భారతి, టబు, కత్రినా కైఫ్ ఇలా ఎంతో మంది టాప్ స్టార్ హీరోయిన్స్ ని పరిచయం చేసాడాయన. అలా ప్రముఖ స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ని కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం నువ్వు నాకు నచ్చావ్. ఇదే ఆర్తి అగర్వాల్ కి కూడా మొదటి సినిమా, ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వడం తో ఆర్తి అగర్వాల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ అనతి కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈమె ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా తర్వాత వెంకటేష్ తో కలిసి వసంతం, సంక్రాంతి వంటి చిత్రాలు చేసింది.

అన్నీ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. అలా టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జంటగా పేరు తెచ్చుకున్న వీళ్లిద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ‘వసంతం’ చిత్రం లో వీళ్లిద్దరి మధ్య ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇందులో ఒక సన్నివేశం లో వెంకటేష్(Venkatesh) చీర కట్టుకోవడం చేతకాని ఆర్తి అగర్వాల్ కి స్వయంగా తన చేతుల మీదుగా చీర కడుతాడు. ఈ సన్నివేశం రియాలిటీ కి దగ్గర్లో ఉండే విధంగా ఉండడాన్ని కోసం వెంకటేష్ నిజంగానే ఆర్తి అగర్వాల్ కి చీర కట్టాడట.

ఇది అప్పట్లో సెన్సేషనల్ న్యూస్ గా మారింది. ఈ విషయం వెంకటేష్ భార్య నీరజకి కూడా తెలిసింది, ఆమె సినిమాల్లో ఇలాంటివి అన్ని కామన్ కదా అని అనుకొని పెద్దగా పట్టించుకోలేదట. వెంకటేష్ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒక సినిమా పేరు వచ్చేసి సైంధవ్, మరో సినిమా పేరు ఆట నాదే వేట నాదే. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. ఈ మధ్య కాలం లో వెంకటేష్ కి పెద్ద హిట్లు లేవు అని చెప్పుకోవాలి, కనీసం ఈ సినిమాలు అయినా హిట్ అవుతాయి అని దగ్గుబాటి ఫాన్స్ ఆశిస్తున్నారు.

Exit mobile version