సినీ పరిశ్రమలో చాలా వరకు అందరు ప్రేమ వివాహాలే చేసుకుంటారు. ఎంత త్వరగా ప్రేమలో పడతారో పెళ్లి చేసుకుని అంతే త్వరగా విడాకులు కూడా తీసుకుంటారు. ఇలా జరగటం మనం ఇప్పటికే చాలా మంది విషయంలో చూసాం. దర్శక ధీరుడు రాజమౌళి కూడా రమాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంతకు ముందే పెళ్లై విడాకులు తీసుకున్న రమాను రాజమౌళి ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నారు..
రమా రాజమౌళి మొదటి భర్త చాలా చెడ్డవాడు అంత, ఇపుడు ఏదో ఒక ఇబ్బంది పెట్టేవాడు అంత. ఎంత చెప్పినా మారపోయేసరికి కొడుకుని తీసుకొని తన అక్క ఇంటికి వెళ్లిపోయింది అట. కార్తికేయ మొద్తటి భర్త కుమారుడే. అలా తన అక్క ఇంట్లో ఉండగా రాజమౌళి పరిచయం అయ్యాడు. రాజమౌళి తను రాసుకున్న కథలు అన్ని రామా కి చెప్పేవాడు, అవి వింటూ రామ అందులో మార్పులు చేర్పులు చెప్పేది అట.
ఇంక ఆ సమయంలోనే రాజమౌళి రమతో ప్రేమలో పడిపోయాడు. అలా వారిద్దరూ ప్రేమలో ఉన్నపుడు చాలా సినిమాలు చూసేవారట, వారు ఎక్కువగా చూసిన సినిమా తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమా. ఆ సినిమా వారి ప్రేమబంధాన్ని చాలా బలపరిచింది అట.. ఇక ఇంట్లో ఒప్పించుకొని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా నెట్టింట వైరల్ అవుతుంది.