Home Cinema హీరో నవీన్ పోలిశెట్టికి ఘోరమైన ఆక్సిడెంట్.. అమెరికా లో చికిత్స..

హీరో నవీన్ పోలిశెట్టికి ఘోరమైన ఆక్సిడెంట్.. అమెరికా లో చికిత్స..

naveen-polishetty-got-severly-injured-in-an-accident-while-shooting-in-america

డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వం వహించిన జాతిరత్నాలు సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఆ సినిమాలో తన మానరిజం తో, కామెడీ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దెగ్గరయ్యాడు. ఈ ఒక్క సినిమాతో స్టార్ హీరో పేరు సంపాదించేసుకున్నాడు. ఇటీవల హీరోయిన్ అనుష్క శెట్టి తో కలిసి తను నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కూడా బాగా ఆడి మంచి కలెక్షన్ సంపాదించుకుంది. ఈ సినిమాలో కూడా నవీన్ యాక్టింగ్ హైలైట్ అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం హీరో నవీన్ కు సంబంధించి ఒక వార్త ట్విట్టర్ లో బాగా చెక్కర్లు కొడుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం అమెరికాలో తన సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ లో భాగంగా బైక్ నడిపే సీన్ చేస్తుండగా ఆక్సిడెంట్ జరిగింది అని తెలుస్తుంది. బైక్ నడుపుతూ ఉండగా స్లిప్ అయ్యి కింద పడ్డాడు నవీన్ అంటూ వార్త సోషల్ మీడియా మొత్తం చెక్కర్లు కొడుతోంది. ఆక్సిడెంట్ పెద్దగానే జరిగింది అట, నవీన్ కు కూడా దెబ్బలు బానే తగిలాయి అని తెలుస్తుంది. డాక్టర్లు 2 నెలలు పూర్తి బెడ్ రెస్ట్ రాసినట్టు సమాచారం. ఈ వార్త విని నవీన్ ఫాన్స్ ఆందోళనపడుతున్నారు.

Exit mobile version