Home Cinema ఉదయ్ కిరణ్ బయోపిక్ తీసేందుకు సిద్ధమైన ఆర్జీవీ.. ఆందోళన పడుతున్న చిరంజీవి..

ఉదయ్ కిరణ్ బయోపిక్ తీసేందుకు సిద్ధమైన ఆర్జీవీ.. ఆందోళన పడుతున్న చిరంజీవి..

Uday Kiran Biopic : రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ డైరెక్టర్స్, టెక్నికల్ సిబ్బంది అంత ఆర్జీవీ శిష్యులే. ఎల్లప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటాడు వర్మ. ఎపుడు ఏదో ఒక పోస్ట్ పెట్టి కాంట్రవర్సీ చేస్తూ ఉంటాడు, ఈయన్ని దేవుడిలా చూసేవారు ఉన్నారు అమ్మనా బూతులు తిట్టేవారు కూడా లేకపోలేదు. ఎవ్వరిని లెక్కచేయక పోవటం, దేనికి బయపడకపోవటం ఆర్జీవీ నైజాం.

uday-kiran

ఎన్నో ఏళ్లుగా మనం హీరో ఉదయ్ కిరణ్ బయోగ్రఫీ రాబోతుంది అని వింటూనే ఉన్నాము కానీ అది ఎపుడు ఎవరు తీస్తారు అనే క్లారిటీ లేదు. ఇపుడు రామ్ గోపాల్ వర్మ హీరో ఉదయ్ కిరణ్ జీవితం మీద ఒక సినిమా చేయబోతున్నాడు అని తెలుస్తుంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొంతకాలానికే మంచి పేరు సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. అందగాడు, మంచి నటన నైపుణ్యం ఉన్నవాడు ఉదయ్ కిరణ్ అందుకే తను ఉన్నది కొంత కాలమే అయినా మంచి అభిమానులని సొంతం చేసుకున్నాడు.

ఉదయ్ కిరణ్ కి మెగా ఫామిలీ కి ఉన్న వివాదాలు తెలిసినవే. చిరంజీవి వల్లే ఉదయ్ కిరణ్ చనిపోయాడు అనే వారు కూడా ఉన్నారు. తన కూతురుని కాదని వేరే అమ్మాయిని చేసుకున్నాడనే కోపంతోనే చిరంజీవి ఉదయ్ కిరణ్ కు అవకాశాలు రాకుండా చేసాడు అని అందరూ అనడం మీరు వినే ఉంటారు. ఇక ఆర్జీవీ ఈ సినిమా చేస్తున్నాడు అని తెలిసి మెగా కుటుంబంలో ఆందోళన మొదలు అయింది. ఎందుకంటే ఆర్జీవీ ఉన్నవి ఉన్నట్టు చూపిస్తాడు, ఎవ్వరికి భయపడడు. దీనిచేత వారు ఎక్కడ బాడ్ ఐపోతారో అని మెగా ఫామిలీ ఆందోళన పడుతుంది అంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Exit mobile version