Home Cinema రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమా ఓటీటీ హక్కులు అన్ని కోట్లా..

రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమా ఓటీటీ హక్కులు అన్ని కోట్లా..

ram-charan-game-changer-ott-digital-streaming-rights-sold-for-crores

Game Changer OTT : రామ్ చరణ్, ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఎవ్వరు లేరు మన భారత దేశంలో. RRR సినిమాతో మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం దర్శకుడు శంకర్ తో కలిసి ‘గేమ్ చెంజర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లెక్క ప్రకారం ఎప్పుడో పూర్తికావలసి ఉంది, కానీ రామ్ చరణ్ కు కూతురు జన్మించడంతో చరణ్ 3 నెలలు సినిమాలు అన్ని మానేసి కూతురితో సమయం గడుపుతూ ఉండి పోయాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేయబోతున్నారు.

ఇక స్టార్ హీరో సినిమాలు అంటే తెలిసిందేగా బడా స్ట్రీమింగ్ కంపెనీ వాలు హక్కులు కొనేందుకు తెగ పోటీ పడుతూ ఉంటారు. ఇది రామ్ చరణ్ సినిమా ఇక వారి మధ్య పోటీ చాల గెట్టిగా నడుస్తుంది. గేమ్ చెంజర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కొనేందుకు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ విపరీతంగా పోటీ పడ్డాయి. చివరకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 105 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ విషయం స్వయంగా కంపెనీ యాజమాన్యం తన సోషల్ మీడియా కాత ద్వారా తెలియచేసారు. ఫాన్స్ మాత్రం ఈ న్యూస్ విని మావోడి సినిమా రిలీజ్ కు ముందే 100 కోట్లు సంపాదించింది అంటూ తెగ సంబర పడిపోతున్నారు.

Exit mobile version