Home Cinema Pooja Hegde: బుట్టబొమ్మని మల్లి లైనులో పెట్టేసిన త్రివిక్రమ్.. ఎం మాయ చేసిందో..

Pooja Hegde: బుట్టబొమ్మని మల్లి లైనులో పెట్టేసిన త్రివిక్రమ్.. ఎం మాయ చేసిందో..

Trivikram Backs Pooja Hegde: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన హీరోయిన్స్ లో ఒకరు పూజ హెగ్డే. ‘ఒక లైలా కోసం’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె, ఆ సినిమా సక్సెస్ తో మంచి ఆరంభాన్ని దక్కించుకున్న ఆమె ఆ తర్వాత ‘ముకుంద’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించకపోయినా కూడా ఆమెకి మంచి అవకాశాలే వచ్చాయి. టాలీవుడ్ లో కంటే కూడా బాలీవుడ్ లోనే ఈమెకి ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. అలా బాలీవుడ్ లో తొలిసినిమాతోనే హృతిక్ రోషన్ తో నటించే ఛాన్స్ దక్కింది కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

trivikram-pooja-hegde

దాంతో కొన్నేళ్లు విరామం తీసుకున్న ఈమె, మళ్ళీ టాలీవుడ్ లోకి అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇక్కడి నుండి ఈమె రేంజ్ ఎలా మారిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఈమె ఇండస్ట్రీ లో వచ్చిన తర్వాత ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ తో బాగా సన్నిహితంగా ఉంటుందని ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఒక టాక్ ఉంది. ఆయన వల్లే పూజ హెగ్డే కి అవకాశాలు వస్తున్నాయి అని అనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కొత్త గా వచ్చిన శ్రీలీల కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడట.

గుంటూరు కారం నుండి ఆమెని తప్పించి శ్రీలీల ని మెయిన్ హీరోయిన్ గా చేసాడని, ఇందుకు పూజ హెగ్డే మనసు చాలా నొచ్చుకొని త్రివిక్రమ్ కి దూరంగా ఉంటూ వస్తుంది అని ఇలా ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. గుంటూరు కారం నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ పూజ హెగ్డే తప్పించలేదని, మహేష్ బాబు ఛాయస్ వల్లే ఆమెని తీసి వెయ్యాల్సి వచ్చిందని పూజ హెగ్డే కి సర్దిచెప్పి, ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) మరియు సంపత్ నంది కాంబినేషన్ లో తన భార్య నిర్మాణ సంస్థ ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెరక్కించే సినిమా లో హీరోయిన్ రోల్ ఆఫర్ చేసాడట త్రివిక్రమ్ (Trivikram Backs Pooja Hegde).

దానికి ఆమె కూడా ఒప్పుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన పూజ హెగ్డే ఈ సినిమా ద్వారా బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఐతే బుట్టబొమ్మ చాల కాళిగానే ఉంది అనే చెప్పుకోవాలి. ఏదో టీవీ యాడ్లు, బ్రాండ్ ప్రమోషన్లు చేస్తూ గడుపుతుంది పూజ. చూదాం సాయి ధరమ్ తేజ్ తో తను ఒప్పుకున్న సినిమా స్టార్ట్ అయ్యి, హిట్టు కొడుతోంది ఏమో. సాయి ధరమ్ తేజ్ మాత్రం మంచి ఫార్మ్ లో ఉన్నాడు అనే చెప్పాలి. తేజ్ అదృష్టం ఏమయిన పూజ పాపకి అంటుకుంటుందేమో చూదాం.

Exit mobile version