Home Cinema Pushpa 2 : అల్లు అర్జున్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. సమస్యలలో పుష్ప 2..

Pushpa 2 : అల్లు అర్జున్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. సమస్యలలో పుష్ప 2..

Pushpa 2 : దేశవ్యాప్తంగా సినిమా ప్రజలను ఎవరిని అడిగిన పేరు పుష్ప రాజ్ తగ్గేదేలేదంటూ అంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ స్టైలిష్ హీరో ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా గురించి ఎప్పుడు ఏ వార్త బయటకు వచ్చినా అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాల వాసులు చాలా ఆశలు పెట్టుకున్నారు.

అలాగే సినిమాకు సంబంధించిన వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాని అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసేలా రూపొందిస్తున్నాడు. ఇది అందరూ ఊహించినదే. కానీ పుష్ప సినిమా కంటే రెట్టింపు బిజినెస్ జరగాలని అందరూ ఆశపడుతున్నారు. అయితే ఈ తెలుగు సినిమా తీరు ట్రేడ్ వర్గాల్లో గందరగోళం రేపుతోంది. ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అందువల్ల తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం నిర్మాతలు అధిక ధర వసూలు చేయడం సహజం.

distributors-stepping-back-to-buy-allu-arjun-pushpa-2-cinema-as-mythri-movie-makers-quoting-high-price

అయితే ఈ రేట్లను తాము సరిపోల్చలేమని డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో రైట్స్ కొనుకుంటే అవి తిరిగి రావని ఆసక్తి చూపట్లేరు డిస్ట్రిబ్యూటర్లు. మరి ముఖ్యంగా ఆంధ్రాలో థియేటర్లకు స్పెషల్ షోలు మంజూరు చేయడం లేదు. ఇది డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సమస్యగా మారింది. మరి మైత్రి సినిమా ఈ సినిమాను ఏ రేటుకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముతారు చూడాలి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది మరియు అల్లు అర్జున్ అభిమానులకు టెన్షన్ తెప్పిస్తుంది.

Exit mobile version