Home Cinema Dhanush : రెండో పెళ్లికి సిద్దమైన ధనుష్.. వధువు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Dhanush : రెండో పెళ్లికి సిద్దమైన ధనుష్.. వధువు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Dhanush : కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ధనుష్ ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యారనే వార్త కోలీవుడ్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అతను స్టార్ హీరో కాబట్టి, అతని గురించిన వార్తలు వెంటనే వైరల్ అవుతాయి. అందుకే ఈ మధ్య కాలంలో ఆయన పెళ్లికి సంబంధించిన వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక 2004లో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ను పెళ్లి చేసుకున్న ధనుష్, 2022లో ఆమె నుంచి విడాకులు తీసుకొని సెపరేట్ అయ్యారు.

అయితే పెళ్ళైన 18 ఏళ్ల తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి ఇద్దరూ విడాకులు తీసుకొవాలని నిర్ణయించుకున్నారు. 2022 నుండే ధనుష్ మరియు ఐశ్వర్యాలు విడిపోయి దాదాపు రెండేళ్ల తర్వాత ఈ జంట చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేశారు. అయితే, వారి విడాకుల వార్తలను ఇరు కుటుంబ సభ్యులు ఖండించారు మరియు విడాకులను తీసుకోకుండా ఆపడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ధనుష్ మరియు ఐశ్వర్య కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు.

dhanush-getting-ready-for-his-second-marriage

ధనుష్‌కి ఐశ్వర్యతో యాత్ర మరియు లింగ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ధనుష్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ధనుష్ తండ్రి కస్తూరి రాజా మాత్రం తన కొడుక్కి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ధనుష్ తండ్రి ఆలోచన మేరకు సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏదో సమస్య వస్తుందనే ఉద్దేశ్యంతో సినీ పరిశ్రమకు చెందిన వారిని కాకుండా తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి.

Exit mobile version