Home Cinema ఎన్టీఆర్ పై ఫాన్స్ ఫైర్..కారణం ఆ సినిమానే..

ఎన్టీఆర్ పై ఫాన్స్ ఫైర్..కారణం ఆ సినిమానే..

Jr NTR: ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు . భీం పాత్ర లో ఆయన ప్రేక్షకులను అలరించిన తీరు అంతా ఇంతా కాదు. అలాంటి ఎన్టీఆర్ తో సినిమాలో చేయడానికి దేశంలోని దర్శక నిర్మాతలు మాత్రమే కాదు ప్రపంచంలోని దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సిద్ధమయ్యాడు. ఆయన గతంలో నటించిన వార్ సినిమాకు సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రెండవ హీరో పాత్రకు ఎన్టీఆర్ ను ఎంపిక చేసుకున్నాడు అన్న వార్తలు మొన్నటిదాకా వినిపించాయి.

ntr war2

అయితే అధికారిక ప్రకటన రాకపోవడంతో అసలు ఈ సినిమా ఉందో లేదో అన్న అనుమానాలు ఏర్పడ్డాయి. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా హీరో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో ఈ సినిమా ఉందని గ్యారంటీ అయిపోయింది. ఈ ట్వీట్ వల్ల ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి కొదవ లేకుండా పోయింది. సరైన సినిమా పడితే ఎన్టీఆర్ లెవెల్ మారిపోవడం ఖాయం అని చెప్తున్నారు. అయితే ఈ సినిమా పట్ల మిక్స్డ్ అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా చేయడం తెలివి తక్కువ పని అని అంటున్నారు.

సోలో హీరోగా చేసి పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదగాలి కానీ ఇతర హీరోలతో సినిమాలో చేయడం వల్ల సగం క్రెడిట్ వాళ్ళకే వెళ్లిపోతుంది అని వారు బాధపడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయంలో ఇది అందరికీ అర్థమైన విషయం అనేది తెలిసిందే. బయట సాధారణ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోకపోయినా కూడా అభిమానులు మాత్రం దీనిని పట్టించుకుంటారు. ఎంత లేదన్న రాజమౌళి రామచరణ్ పాత్రను చేసినట్లు ఎన్టీఆర్ పాత్రను తీర్చిదిద్దలేదు అని ఆయన అభిమానులు చెబుతూ ఉంటారు. ట్విట్టర్లో వార్లు కూడా జరుగుతూ ఉంటాయి.

ఇలాంటి సమయంలో మళ్ళీ ఒక మల్టీ స్టార్టర్ సినిమా చేయడం ఎన్టీఆర్ కు అంత మంచిది కాదు అని వారు అభిప్రాయపడ్డారు. కానీ వారి మాట వినక ఎన్టీఆర్ మళ్ళీ మళ్ళీ అలాంటి సినిమా చేయడం ఆయన కెరియర్ కు ఎంత ఉపయోగపడుతుందో చూడాలి. ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయర్థంనుంచే మొదలుకాపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఈ వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఏ విధంగా ఉంటుందో చూడాలి. చాలామంది ఈ పాత్ర నెగిటివ్ షేడ్స్ లో ఉండబోతుంది అని చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.(Jr NTR)

Exit mobile version