Home Cinema Rakesh Master: ఇండస్ట్రీ లో ఉన్న వారే రాకేష్ మాస్టర్ ని చంపాలి అని అనుకున్నారా..అప్పట్లో..

Rakesh Master: ఇండస్ట్రీ లో ఉన్న వారే రాకేష్ మాస్టర్ ని చంపాలి అని అనుకున్నారా..అప్పట్లో..

Rakesh Master: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఎస్ రామారావు, రాకేష్ మాస్టర్ గా ప్రసిద్ధి చెందారు, ఆదివారం నాడు 53 సంవత్సరాల వయస్సులో మరణించారు. 1968లో తిరుపతిలో జన్మించిన ఆయన, ఆటా మరియు ఢీ వంటి డ్యాన్స్ రియాలిటీ షోలతో తన కెరీర్‌ను ప్రారంభించి, టాప్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్ మరియు జానీలకు శిక్షణ ఇచ్చారు. మాస్టర్. విశాఖపట్నంలో ఔట్ డోర్ షూటింగ్ నుంచి తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురయ్యాడు. 20 రోజుల షూటింగ్‌ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగొచ్చాక వాంతులు చేసుకోవడం మొదలుపెట్టారు.

rakesh master

ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న దెగర నుండి దాదాపు వందలకు పైగా సినిమాల్లో తన కొరియోగ్రఫీతో స్టార్ హీరో హీరోయిన్స్ ని సైతం మెప్పించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్.జూన్ 18, ఆదివారం రోజు సాయంత్రం 5 గంటలకు గాంధీ హాస్పిటల్ లో కన్నుమూశారు. అధిక మధ్యపానం తాగడం వల్ల మల్టీ ఆర్గాన్స్ చెడిపోయి ఆయన మరణించారని హాస్పిటల్ వైద్యులు తెలియజేశారు. ఈ విషయం పక్కన పెడితే ఈయన ఇండస్ట్రీలోకి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చారు.

మొదట్లో ఈయన కొరియోగ్రాఫర్ అవుదామని చెన్నైకి వెళ్ళినప్పుడు ఎన్నో నిద్రలేని రాత్రులు, తినడానికి తిండి లేని రోజులు కూడా గడిపారట. అయితే ఈయన దీనస్థితి చూసి ఓ మేనేజర్ తిండిపెట్టి ఆయన డాన్స్ టాలెంట్ చూసి ముక్కు రాజు గారికి పరిచయం చేశారట. అలా ముక్కు రాజు రాకేష్ మాస్టర్ టాలెంట్ చూసి ఆయన దగ్గర ఉండే 14 మంది డాన్సర్లకు ఈయనను మాస్టర్ గా నియమించారు.కానీ ఆ 14 మంది డాన్సర్లు రాకేష్ మాస్టర్ తమకి మాస్టర్ గా పెట్టడం అసలు నచ్చలేదు.

సీనియర్స్ అందరూ రాకేష్ మాస్టర్ పై కోపం పెంచుకున్నారు ఇక దానికి తగ్గట్టుగానే రాకేష్ మాస్టర్ కూడా వాళ్లపై అరుస్తూ మీకంటే నేనే గొప్ప అన్నట్లుగా గొప్పలకు పోయాడట. దాంతో ఈ డాన్సర్లు రౌడీలను పెట్టి రాకేష్ మాస్టార్ ను బెదిరించారట.(Rakesh Master)అయినప్పటికీ రాకేష్ మాస్టర్ బెదరకపోవడంతో రౌడీలతో రాకేష్ మాస్టర్ ని చంపించాలని ప్లాన్ వేశారట.

అయితే ఈ విషయం తెలుసుకున్న ముక్కు రాజు నీ టాలెంట్ పదిమందికి ఉపయోగపడుతుందని నేను ఇక్కడ పెట్టుకున్నాను.కానీ ఇలా నిన్ను చంపించాలని చూస్తే నేను ఊరుకోను. నువ్వు వెంటనే ఇక్కడినుండి వెళ్ళిపో అంటూ చెప్పారట.దాంతో రాకేష్ మాస్టర్ హైదరాబాద్ కి తిరిగి వచ్చారట.

Exit mobile version